Anushka Shetty in Acharya: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌.. ఆచార‍్యలో స్టార్ హీరోయిన్!

Anushka Shetty to play Key Role in Acharya Movie. ఆచార్య సినిమాలో ఓ సీన్‌ కోసం స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టిని తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతిథి పాత్రకు అనుష్కని స్పంద్రించినట్లు సమాచారం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 27, 2022, 11:30 PM IST
  • మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు ఆచార్య
  • అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌
  • ఆచార‍్యలో స్టార్ హీరోయిన్
Anushka Shetty in Acharya: అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్‌.. ఆచార‍్యలో స్టార్ హీరోయిన్!

Anushka Shetty to play Key Role in Acharya Movie: టాలీవుడ్ మెగాస్టార్‌ చిరంజీవి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా.. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు శుక్రవారం (ఏప్రిల్‌ 29న) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి ఆచార్య చిత్రంను నిర్మించారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేసిన ఆచార్య సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా విడుదలకు కేవలం రెండు రోజులే ఉండగా.. సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 

ఆచార్య సినిమాలో ఒక హీరోయిన్‌గా చేసిన కాజల్‌ అగర్వాల్‌ను తొలిగించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని డైరెక్టర్‌ కొరటాల స్వయంగా చెప్పారు. ఆచార్య పాత్రకు ప్రేమను జోడిస్తే బాగుంటుందా లేదా అనే డౌట్‌ వచ్చిందని, ఆ సమయంలో కరోనా లాక్‌డౌన్‌ రావడంతో బాగా ఆలోచించి వద్దనుకున్నామని కొరటాల చెప్పారు. దాంతో కాజల్‌తో చేసిన కొన్ని షాట్లను కూడా సినిమాలో జోడించలేదు. అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా బయటికోచ్చింది. 

ఇక ఆచార్య సినిమాలో ఓ సీన్‌ కోసం స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శెట్టిని తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతిథి పాత్రకు అనుష్కని స్పంద్రించినట్లు సమాచారం. ఇంతకీ ఆచార్యలో అనుష్క స్పెషల్‌ సాంగ్‌ చేసిందా లేదా అతిథి పాత్ర చేసిందా అని తెలియరాలేదు. ఇంతకీ ఆచార్యలో అనుష్క ఉందో లేదో తెలియాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే. స్టాలిన్ సినిమాలో అనుష్క స్పెషల్‌ సాంగ్‌ చేసిన విషయం తెలిసిందే. ఇంతవరకు చిరంజీవితో అనుష్క ఒక్క సినిమాలో కూడా జతకట్టలేదు.  ఈ సినిమాలో రామ్ చరణ్ జతగా పూజా హెగ్డే కనిపించనున్నారు. 

Also Read: Srinidhi Shetty Latest Pics: వైరల్‌ ఫొటోషూట్‌.. స్లీవేజ్ షోతో ఆకట్టుకుంటున్న కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి!

Also Read: Sudeep vs Ajay Devgn: బాలీవుడ్‌ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరోల మధ్య ట్విట్టర్ వార్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x