Vastu Tips For Broom: చీపురు వాడే సమయంలో ఈ తప్పులు చేయకండి

 Broom Usage According to the Vastu | ఆఫీసుల్లో, లేదా ఇంట్లో పాత చీపురు తీసి కొత్తది రీప్లేస్ చేయాలి అనుకుంటే అది శనివారం రోజు పెడితేనే మంచిది. శనివారం రోజు కొత్త చీపురు వాడటం మంచిది. 

Last Updated : Nov 22, 2020, 05:11 PM IST
    1. చీపురును అన్ని చోట్ల వాడుతారు. ఇంట్లో, ఆఫీసు అని తేడాలేవీ లేకుండా వాడటం భారతీయులకు అలవాటు.
    2. చీపురు కట్టను పవిత్రంగా చూస్తాం. అందుకే ధనత్రయోదశి రోజు కొత్త చీపురు కొంటాం.
    3. అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటారు.
Vastu Tips For Broom: చీపురు వాడే సమయంలో ఈ తప్పులు చేయకండి

Tips For the Broom usage | చీపురును అన్ని చోట్ల వాడుతారు. ఇంట్లో, ఆఫీసు అని తేడాలేవీ లేకుండా వాడటం భారతీయులకు అలవాటు. చీపురు కట్టను పవిత్రంగా చూస్తాం. అందుకే ధనత్రయోదశి రోజు కొత్త చీపురు కొంటాం. అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అంటారు. 

 

ALSO READ|   Vastu: శ్రీకృష్ణుడి ఫోటో ఈ దిశలో పెడితే ఇంట్లో సంపద కలుగుతుంది

అయితే ఇంట్లో చీపురుకట్టను ( Broom ) ఎక్కడ పెట్టాలి అనేది మనలో చాలా మందిది తెలియదు. చీపురుతో లింకై ఉన్న విషయాలు కూడా తెలియదు. అలాంటి వారికోసం ఈ సూచనలు...

విరిగిన చీపిరి..
మీరు ఇంట్లో వాడుతున్న చీపురు విరిగినా తరువాత దాన్ని వాడుతూ ఉంటే అలా చేయడాన్ని మీరు వెంటనే తగ్గించాలి. చాలా మంది ఇలా విరిగిన చీపురును వాడుతుంటారు. వాస్తు ( Vastu ) ప్రకారం ఇలా చేయకూడదు. ఒకసారి విరిగిన చీపురును వాడటం, లేదా వాటిని మళ్లీ అతికించి లేదా అడ్జస్ట్ చేసి వాడటం అశుభ సూచకంగా ( Bad Omen ) పరిగమిస్తారు.

ALSO READ|  Vaastu and Health: ఇంట్లో ఈ మొక్కలు పెంచితే వాస్తుదోషాలు తొలిగి ఆరోగ్యకరమైన జీవితం సొంతం అవుతుంది

ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు
చీపురు కట్టపెట్టడానికి మంచి స్థలం చూసుకోవాలి. కొన్ని స్థలాల్లో అస్సలు చీపురు పెట్టకూడదు. ముఖ్యంగా బంగారం ( Gold ), నగలు పెట్టే స్థలంలో చీపురు అస్సలు పెట్టకూడదు. దాంతో పాటు డబ్బుల పెట్ట ఉన్న స్థలంలో పెట్టకూడదు. దీని వల్ల మీ వ్యాపారం, నగదు వ్యవహరంలో నష్టం కలగవచ్చు.

చీపురును నిలబెట్టకూడదు...
మీరు ఎక్కడైనా చీపురు వాడుతూ ఉంటే.. దాన్ని వాడిన తరువాత దాన్ని నిలబెట్టే బదులు నేలపై అన్చేయండి. చీపురును ఎప్పుడూ నిలెబట్టి ఉంచరాదు. ఇలా చేయడం అశుభమట. ఇలా చేయకుండా ఉంటే మీ బ్యాంకు ( Bank ) బ్యాలెన్స్ ఎప్పుడూ ఖాళీగా ఉండదు.

సాయంత్రం ఇల్లు క్లీన్ చేయకూడదు
సాయంత్రం సమయంలో చీపురు పట్టకూడదు.. ఇల్లు క్లీన్ చేయకూడదు అని అమ్మమ్మలు చెప్పడం మనం వినే ఉంటాం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందటా. అందుకే సాయంత్రం, లేదా రాత్రి సమయంలో ఇల్లు ఊడవరాదు. ఊడ్చినా, చెత్తను బయటపడేయరాదు.

ALSO READ| Rama Rajya: శ్రీ రామ రాజ్యంలో ప్రజలు ఎలా ఉండేవారు ?  రాముడి పాలన ఎలా సాగింది?

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News