Gajkesri Rajyog: గురు-చంద్రుల అరుదైన యోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Gajkesri Rajyog:  వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2023, 11:45 AM IST
Gajkesri Rajyog:  గురు-చంద్రుల అరుదైన యోగం.. ఈ 3 రాశులవారిని వరించనున్న అదృష్టం..

Gajkesri Rajyog: గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను చేస్తాయి. ప్రస్తుతం దేవగురు బృహస్పతి మీనంలో కూర్చున్నాడు. ఇవాళ అంటే జనవరి 25 రాత్రికి చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రెండింటి కలయిక వల్ల అరుదైన గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు లాభపడనున్నారు. 

వృషభ రాశి (Taurus)
గజకేసరి రాజయోగం వృషభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి కర్మ స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. ధన, ధాన్యాలలో పెరుగుదల ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. 

కర్కాటక రాశిచక్రం (Cancer)
కర్కాటక రాశి వారికి గజకేసరి రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే త్రిభుజాకార గృహంగా కూడా భావించే తొమ్మిదో ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడుతోంది. మీరు ఏ పనిచేపట్టినా దానిని విజయవంతంగా పూర్తిచేస్తారు. రాజకీయాల్లో ఉన్నవారు మంచి పదవిని పొందుతారు. ఉద్యోగాలకు సిద్దమవుతున్న వారు విజయం సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. 

కన్య రాశిచక్రం (Virgo)
గజకేసరి రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి ఏడవ ఇంట్లో ఈ రాజయోగం ఏర్పడబోతోంది. మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదే మంచి సమయం. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో భారీగా లాభాలను గడిస్తారు. 

Also Read: Tilkund Chaturthi 2023: తిల్కుండ్ చతుర్థి నేడే.. ఇవాళ గణేశుడికి ఈ పరిహారం చేస్తే మీకు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News