Karwa Chauth 2023 Date: కర్వా చౌత్(అట్ల తద్ది) అక్టోబర్ 31నా లేదా నవంబర్ 1నా?

Karwa Chauth 2023: ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియ రోజున కర్వా చౌత్ జరుపుకుంటారు. ఈ పండుగ ఈ ఏడాది ఎప్పుడు వచ్చిందంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2023, 05:47 PM IST
Karwa Chauth 2023 Date: కర్వా చౌత్(అట్ల తద్ది) అక్టోబర్ 31నా లేదా నవంబర్ 1నా?

Karwa chauth festival: హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలలో కర్వా చౌత్ ఒకటి.  ఈ పండుగకు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరు ఉంది. ఈ పెస్టివల్ ను తెలుగు రాష్టాల్లో 'అట్ల తద్ది' అని పేరుతో పిలుస్తారు. దీనినే ఉయ్యాల పండుగ, గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఈ వేడుకను ముఖ్యంగా హిందూ మరియు పంజాబీ కమ్యూనిటీల్లో వివాహిత స్త్రీలు జరుపుకుంటారు. భర్తల దీర్ఘాయువు మరియు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ఈ నిర్జల వ్రతాన్ని పాటిస్తారు మహిళలు. ఈ పండుగను ఏటా ఆశ్వయుజ బహుళ తదియ రోజు జరుపుకుంటారు. ఇది దసరా పండుగ అయ్యాక ఎనిమిది రోజులకు వస్తుంది. 

అయితే ఈ సంవత్సరం కర్వా చౌత్ ఎప్పుడు చేసుకోవాలనే విషయంలో జనాల్లో గందరగోళం నెలకొంది. అక్టోబరు 31 అని కొందరు, నవంబరు 01న అని మరికొందరు అంటున్నారు. ఈసారి అట్ల తద్ది నవంబరు 01, బుధవారం జరుపుకోవాలి. అయితే ఈ పండుగను పెళ్లైనా ఆడవారు మాత్రమే కాదు.. పెళ్లికానీ యువతలు కూడా జరుపుకోవచ్చు. మంచి భర్త రావాలని, వైవాహిక జీవితం బాగుండాలని ఈ నోము నోచుకుంటారు కన్నె పిల్లలు. 

కర్వా చౌత్ 2023 ముహూర్తం
కర్వా చౌత్ ఉపవాస సమయం - ఉదయం 06:36 - రాత్రి 08:26
కర్వా చౌత్ పూజ ముహూర్తం - సాయంత్రం 05.44-  రాత్రి 07.02 (1 నవంబర్ 2023)
చంద్రోదయ సమయం - రాత్రి 08:26 (1 నవంబర్ 2023)

పూజా విధానం
కర్వా చౌత్ రోజున మహిళలు, కన్నె పిల్లలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేస్తారు. వీరు రోజంతా ఉపవాసం ఉంటారు. గౌరీ దేవికి పూజ చేస్తారు. ఆ తల్లికి నైవేద్యంగా అట్లు పెడతారు. అందుకే దీనిని అట్ల తద్ది అని పిలుస్తారు. సాయంత్రం మహిళలు పెళ్లికూతురులా ముస్తాబవుతారు. అనంతరం జల్లెడ ద్వారా చంద్రుడిని చూస్తూ ఉపవాసం విరమిస్తారు. ఈ నోమును ఆచరించడం వల్ల వారు నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉంటారని నమ్మకం. 

Also Read: Pregnancy : ఈరోజే పవర్ఫుల్ చంద్రగ్రహణం.. గర్భిణీ స్త్రీలు తప్పక ఇవి పాటించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x