life lessons you can learn from Lord Vinayaka: గణేశుడిలో ఉండే ప్రత్యేక గుణాలను అలవర్చుకుంటే మంచి భవిష్యత్తు

life lessons you can learn from Lord Ganesha :  విఘ్నేశ్వరుడిలో (Vigneshwarudu)ఉండే  ప్రత్యేకమైన గుణాలేంటో ఒకసారి తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడికి కుతూహలం ఎక్కువ. ఏ విద్యార్థైనా సరే కొత్త విషయాలపై ఎక్కువగా ఆసక్తి పెంచుకోవాలి. కుతూహలాన్ని చూపాలి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 11, 2021, 11:07 AM IST
  • పని పూర్తి చేసేవరకు పట్టువదలని నైజం
  • సంయమనాన్ని కోల్పోని తత్వం
  • స్మార్ట్ వర్క్ బాగా తెలిసిన విఘ్నేశ్వరుడు
  • గణేశుడి నుంచి నేర్చుకోవాల్సిన ఇలాంటి అంశాలు ఎన్నో
life lessons you can learn from Lord Vinayaka: గణేశుడిలో ఉండే ప్రత్యేక గుణాలను అలవర్చుకుంటే మంచి భవిష్యత్తు

Better future if you adopt the special qualities of Ganesha: పార్వతీ తనయుడు వినాయకుడిలో ఎన్నో ప్రత్యేక గుణగణాలున్నాయి. వాటన్నింటినీ చిన్నారులు అలవర్చుకుంటే వారికి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. మరి విఘ్నేశ్వరుడిలో (Vigneshwarudu)ఉండే ఆ ప్రత్యేకమైన గుణాలేంటో ఒకసారి తెలుసుకుందాం. విఘ్నేశ్వరుడికి కుతూహలం ఎక్కువ. ఏ విద్యార్థైనా సరే కొత్త విషయాలపై ఎక్కువగా ఆసక్తి పెంచుకోవాలి. కుతూహలాన్ని చూపాలి. లేకపోతే వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండదు. 

గణేశుడికి (Ganesha) కుతూలహానికి నిదర్శంగా ఎన్నో కథనాలు ఉన్నాయి. ఒకసారి వర్షాల్లేక విపరీతమైన కరవుకాటకాలతో అల్లాడిపోతున్న ప్రాంతంలో వర్షాలు పడేలా చేసేందుకు అగస్త్య మహాముని (Agastya Mahamuni) శివుని (Lord Shiva) దగ్గరున్న గంగాజలాన్ని తీసుకుని తన కమండలంలో నింపుకొని బయలుదేరాడు. విశ్రాంతి తీసుకుందామని ఓ చోట కాసేపు పడుకున్నాడు. ఇంతలో ఆ కమండలంలో ఏముందో తెలుసుకుందామనుకున్నాడు గణేశుడు. తన కుతూహలం కొద్దీ కాకి రూపంలోకి మారి దానిపై వాలాడు. ఆ బరువుకి కమండలంలోని నీళ్లు కిందపోయి కావేరీ నదిగా (Kaveri River) మారి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశాయి. గణేశునిలోని ఆసక్తీ, కుతూహలమే ఇందుకు కారణంగా చెప్తుంటారు. అందుకే మనం లంబోదరుడి నుంచి కుతూహలం గుణాన్ని మన పిల్లలకు నేర్పించాలి. 

పని పూర్తి చేసేవరకు పట్టువదలని విక్రమార్కుడు

ఎంతో వేగంగా రాయడం వినాయకుడికి ఉన్న ప్రత్యేకత. వ్యాసుడు మహాభారతాన్ని (Mahabharatham) చెప్తూ ఉంటే ఎక్కడా ఆపకుండా రాస్తానని వ్యాసుడికి మాటిచ్చాడు విఘ్నేశ్వరుడు. అయితే మధ్యలో లంబోదరుడి కలం పని చేయలేదు. ఆ సమయంలో విఘ్నం కలగకూడదని తన దంతాన్ని విరగ్గొట్టి దాంతోనే రాసి ఆ పనిని పూర్తిచేశాడు. అంతటి పట్టుదల ఉంది వినాయకుడిలో. అందుకే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి.

Also Read : Sai dharam tej accident case: సాయిధరమ్ తేజ్‌పై కేసు నమోదు.. CCTV visuals పరీశీలన

సంయమనాన్ని కోల్పోకూడదు

మహా ధనవంతుడైన కుబేరుడు (Kuberadu) శ్మశానంలో ఉండే శివునికి తన దర్పాన్ని, సంపదలని చూపించాలనుకున్నాడు. తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని శివుడికి ఆహ్వానం పలికాడు. శివుడు తనకు వీలుపడదని, తన కుమారుడు వినాయకున్ని పంపాడు. గణేశుడికి కుబేరుడి మనస్సులో ఏముందో అర్థమైంది. సరే నువ్వు తినడానికి ఎంత పెడ్తావో చూస్తా అన్నట్లు కూర్చొన్నాడు. కుబేరుడు ఆడంబరంగా వడ్డిస్తుంటే... పెట్టినవి పెట్టినట్టు తినేశాడు వినాయకుడు. కుబేరుని దగ్గర అన్నీ అయిపోయాయి. అప్పుడు కుబేరునికి గర్వభంగం అయ్యింది. ఎలాంటి పరిస్థితుల్లోనూ సంయమనాన్ని కోల్పోకూడనేది ఇక్కడ విఘ్నేశ్వరుడు మనకు చెప్పే నీతి.

హార్డ్ వర్క్ కాదు.. స్మార్ట్ వర్క్ తెలిసి ఉండాలి

గణేశునికీ, ఆయన సోదరుడు కుమారస్వామికీ (Kumaraswamy) ఒక పోటీ పెట్టారు పార్వతీపరమేశ్వరులు. భూమండలాన్ని మూడుసార్లు వేగంగా చుట్టి వచ్చిన వారికి మహిమాన్విత ఫలం బహుమతి. కార్తికేయునితో పోలిస్తే గణేశుడికి ఎలాంటి వనరులు లేవు. అందులో పెద్ద భారీకాయంతో ఉంటాడు విఘ్నేశ్వరుడు. అందుకే ఆయన స్మార్ట్‌ (Smart‌)గా ఆలోచించారు. అమ్మానాన్నల చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేసి..  మీరే నా ప్రపంచం.. నా ప్రపంచ ప్రదక్షిణ పూర్తి చేశాను అన్నారు వినాయకుడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా కంగారు పడిపోకుండా మనకు వాటిని ఎలా అనుకూలంగా మలుచుకోవాలో అలవర్చుకోవాలి. ఇలాంటి పాఠాలన్నీ మనం వినాయకుడి (Vinayakudu) నుంచి నేర్చుకుని మన పిల్లలకు వాటిని అలవరిస్తే వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.

Also Read : 9/11 Attacks: 9/11 దాడులకు సరిగ్గా 20 ఏళ్లు..ఆ రోజు అసలేం జరిగింది, ఎలా జరిగింది

 

Trending News