/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Lucky Dates in 2022: What is the good time to buy new property in New Year ? చాలా మందికి ఇల్లు కొనాలనే ఒక లైఫ్ టైమ్ డ్రీమ్ ఉంటుంది. అలాగే కొందరికి మరికొన్ని ఆస్తులు కొనాలనే ఆలోచన ఉంటుంది. సరే ఏ ఆస్తి అయినా సరే 2022 సంవత్సరంలో మీరు కొనాలంటే ముందుగా కొన్ని లక్కీ డేట్స్ ను గుర్తు పెట్టుకోండి. (Numerological Prediction For 2022) వాటిని నోట్ చేసుకుని ఆ తేదీల్లో (Lucky Dates‌) ఆస్తులను కొనుగోలు చేస్తే మీ ప్రాపర్టీకి తిరుగుండదు. తక్కువ సమయంలోనే మీ ఆస్తికి రెట్టింపు డిమాండ్ వస్తుంది. కొత్త ఏడాదిలో కొత్త ప్రాపర్టీలు కొనేవాళ్లకు ఈ లక్కీ డేట్స్ బాగా కలిసొస్తాయట.

న్యూమరాలజీ ప్రకారం 2022 సంవత్సరంలో ఆస్తిని కొనుగోలు చేసేందుకు కొన్ని లక్కీ డేట్స్ ఉన్నాయి. (Lucky Dates to Buy Property in New Year) న్యూమరాలజీ ప్రకారం 2022 సంఖ్య అంటే మొత్తం కలిపి 6 నెంబర్ అవుతుంది. 6 నెంబర్ పై శుక్రుడి ప్రభావం ఉంటుంది. అంటే 2022లో అందరూ శుక్రుడిని వారి జీవితాల్లోకి ఆహ్వానిస్తున్నారన్న మాట. అలాగే 2022వ సంవత్సరంపై చంద్రుడి ప్రభావం కూడా ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం 2022వ సంవత్సరం కొందరికి చాలా అనుకూలంగా ఉంటుంది. 

2022లో రియల్ ఎస్టేట్ రంగం (real estate sector) మళ్లీ పుంజుకుంటుంది. రియల్ ఎస్టేట్ (real estate) రంగంలో పని చేసే వారందరికీ 2022లో బాగా కలిసొస్తుంది. ఈ రంగంతో అనుబంధం ఉన్న వారంతా 2022లో బాగా లాభపడతారు. నెంబర్ 6 పై శుక్రుడి అనుకూల ప్రభావం ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం పురోగతి సాధిస్తుంది. 6 నంబర్‌‌తో పాటు 0 నంబర్‌‌‌ కూడా ఈ రంగం వృద్ధికి దోహదం చేస్తుంది. దీంతో ఆస్తులలో పెట్టుబడి పెట్టాలని లేదా ఆస్తులను కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది మంచి సమయం. రియల్ ఎస్టేట్‌ (Real Estate‌) రంగంతో అనుబంధం ఉన్న రంగాలన్నీ కూడా 2022లో లాభాల బాటలో నడుస్తాయి.

Also Read : Financial Things to do: డిసెంబర్​ 31 సమీపిస్తోంది.. ఈ పనులు పూర్తి చేశారా?

ఇక 2022 సంవత్సరంలో కొన్ని తేదీలు ఆస్తులు (property) కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉన్నాయి...

జనవరి: (January) జనవరిలో, 14, 20, 21, 27వ తేదీలలో ఆస్తులను కొనుగోలు చేయడం మంచిది. ఫిబ్రవరి 3, 4, 11, 17, 18, 24, 25 తేదీలు మంచివి. మార్చి 3, 4, 10, 11, 17, 24, 25, 31 తేదీలు మంచివి.

ఏప్రిల్: (April) ఒకవేళ మీరు ఏప్రిల్‌లో ఆస్తిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఈ తేదీలు మంచివి. 1, 7, 8, 21, 22, 28, 29వ తేదీలు ఆస్తులు కొనుగోలు చేసేందుకు మంచివి. మే నెలలో 6, 19, 26వ తేదీల్లో ఆస్తులు కొనడం మంచిది. జూన్‌లో 2, 3, 16, 30 తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేయొచ్చు.

జులై: (July) జులైలో 29వ తేదీన ఆస్తిని కొనుగోలు చేయొచ్చు. ఆగస్టులో, 5, 25, 26 వ తేదీలు మంచివి. సెప్టెంబర్ లో 1, 2, 22, 23, 29 30 తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేయొచ్చు.

అక్టోబర్: (October) అక్టోబర్‌లో 7, 14, 20, 21, 27, 28వ తేదీల్లో ఆస్తులు కొనుగోలు చేయొచ్చు.

నవంబర్: (November) 3, 4, 11, 17, 18, 24, 25 తేదీలు అనుకూలమైనవి. డిసెంబర్‌లో 1, 8, 9, 15, 23, 29, 30 తేదీలు ఆస్తులు కొనుగోలు చేసేందుకు మంచివి.

న్యూమరాలజీ (numerology) ప్రకారం పైన ఇచ్చిన తేదీలు.. ఎవరైనా సరే ఆస్తులు (properties) కొనుగోలు (Buy) చేసేందుకు మంచివి. అలాగే మీ పుట్టిన తేదీతో బట్టి మరిన్ని లక్కీ డేట్స్‌ను కూడా మీరు పొందవచ్చు.

Also Read : Rythu Bandhu: రైతులకు గుడ్​ న్యూస్​- రేపటి నుంచే ఖాతాల్లో రైతు బంధు జమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Section: 
English Title: 
Lucky Dates in 2022 What is the good time to buy new property in New Year
News Source: 
Home Title: 

Lucky Dates in 2022: కొత్త ఏడాదిలో కొత్త ప్రాపర్టీలు కొనేవాళ్లకు ఈ లక్కీ డేట్స్ బాగా కలిసొస్తాయట

Lucky Dates in 2022: కొత్త ఏడాదిలో కొత్త ప్రాపర్టీలు కొనేవాళ్లకు ఈ లక్కీ డేట్స్ బాగా కలిసొస్తాయట
Caption: 
Lucky Dates in 2022 What is the good time to buy new property (Zee News)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఇల్లు, ఆస్తులు కొనాలనే వారికి 2022 సంవత్సరం అనుకూలం..

2022లో ఆస్తిని కొనుగోలు చేసేందుకు కొన్ని లక్కీ డేట్స్..

న్యూమరాలజీ ప్రకారం ఇవే లక్కీ డేట్స్

Mobile Title: 
కొత్త ఏడాదిలో కొత్త ప్రాపర్టీలు కొనేవాళ్లకు ఈ లక్కీ డేట్స్ బాగా కలిసొస్తాయట
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Monday, December 27, 2021 - 20:43
Request Count: 
54
Is Breaking News: 
No