Moles In Astrology: పుట్టుమచ్చలు లేని శరీరం ఉండదు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక పుట్టు మచ్చతో పుడుతూ ఉంటారు. శరీరంపై పుట్టుమచ్చ ఉండటం వల్ల కొన్ని సందర్భాల్లో అందంగా కనిపిస్తారు. కొన్నిసార్లు అది మరకలా కనిపించిన అది మీకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని ఓషనోగ్రఫీలో మోల్లోని అధ్యాయణంలో పేర్కొన్నారు. అంతేకాకుండా శరీరంలోని వివిధ భాగాలలో ఉన్న పుట్టుమచ్చల వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఇందులో పేర్కొన్నారు. అయితే పుట్టు మచ్చలు ఉన్న చోట్లను బట్టి అవ్వి మీకు అశుభం కాలిగిస్తుందో..అదృష్టవంతుడిగా మారుస్తుందో మీరు తెలుసుకోవచ్చు. ఎలా ఈ మచ్చలు ఉండడం వల్ల ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
ఇలా పుట్ట మచ్చలు ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు:
కుడి చేతి మీద పుట్టుమచ్చ:
కుడిచేతిపై పుట్టుమచ్చ ఉన్నవారికి డబ్బుకు కొరత ఉండదని శాస్త్రం చెబుతోంది. వారు జీవితంలో అన్ని సౌకర్యాలు పొందడమేకాకుండా.. సమాజంలో చాలా గౌరవం లభిస్తుందని శాస్త్రం తెలుపుతోంది. వీరు అన్ని రంగంలో విజయాలు సాధిస్తారు.
కుడి చెంప మీద పుట్టుమచ్చ:
కుడి చెంపపై పుట్టుమచ్చ ఉండటం చాలా శుభప్రదంగా పరిగణిస్తోంది పుట్టు మచ్చల శాస్త్రం. వీరు అనుకోకుండా డబ్బులు పొందడమేకాకుండా ఇంట్లో వారి ప్రోత్సహం లభిస్తుందని శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా వీరు అన్ని రకాల ప్రయోజనాలు పొందుతారు.
ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ:
ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తికి లక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరు ఎప్పుడు అమ్మవారి అనుగ్రహం పొందుతారు. అంతేకాకుండా వీరు అర్థికంగా చాలా బలంగా తయారవుతారు. వీరు జీవితంలో ఏమి పనులు చేయాలనుకున్న సులభంగా చేస్తారు. అంతేకాకుండా అనుకున్న కోరికలు నెరవేరుతాయి.
నుదిటికి కుడి వైపున పుట్టుమచ్చ:
నుదిటికి కుడి వైపున పుట్టుమచ్చ ఉండటం అదృష్టంగా భావిస్తారు. వీరు ఆర్థిక సమస్యల నుంచి సులభంగా బయటపడడమేకాకుండా.. జీవితంలో ఏం చేయాలనుకున్నా సులభంగా చేస్తారు. కష్టపడి విజయాలు కూడా సాధిస్తారు.
కుడి అరచేతిలో పుట్టుమచ్చ:
కుడి అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే..అలాంటి వ్యక్తి చాలా అదృష్టవంతుడని శాస్త్రం పేర్కొంది. ఈ వ్యక్తులు ఏ పనిలో చేయి వేసినా విజయం సాధిస్తారని..అంతేకాకుండా జీవితంలో వీరు అనుకున్నంత డబ్బు సంపాదిస్తారని శాస్త్రం తెలుపుతోంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
Also Read : Puri Jagannadh-Chiranjeevi : చిరు పూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కేనా?
Also Read : Ponniyin Slevan Fake Collections : ఉమైర్ సంధు ట్వీట్లపై నెటిజన్ల ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook