Friday MahaLakshmi Puja: ఈ పరిహారాలు చేస్తే.. మహాలక్ష్మీ అనుగ్రహంతో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి

Maha Lakshmi Grace: మహాలక్ష్మీ అనుగ్రహం పొందడమంటే జీవితంలో సిరిసంపదలు, ఆయురారోగ్యాలను పొందడమే. అందుకే చాలామంది అమ్మవారి కృప కోసం పూజలు, పరిహారాలు చేస్తుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2022, 12:29 PM IST
  • మహాలక్ష్మీ అనుగ్రహం కోసం ఈ పరిహారాలు
  • వీటిని పక్కాగా పాటిస్తే అదృష్టం మీ వెంటే
  • పరిహారాలు.. వాటి ఆచరణ ఇక్కడ తెలుసుకోండి
Friday MahaLakshmi Puja: ఈ పరిహారాలు చేస్తే.. మహాలక్ష్మీ అనుగ్రహంతో సిరిసంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి

Maha Lakshmi Grace: చాలామంది కష్టపడి డబ్బు సంపాదిస్తారు. ఓవైపు ఉద్యోగం చేస్తూ మరోవైపు చిన్నపాటి బిజినెస్‌ల ద్వారా ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ.. వచ్చిన డబ్బు వారి వద్ద నిలవదు. ఏదో ఒక రూపంలో వచ్చిన డబ్బు వచ్చినట్లే మాయమవుతుంది. దీంతో అసంతృప్తి వెంటాడుతుంది. ఇలాంటి సమస్యలతో సతమతమయ్యేవారికి జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

లక్ష్మీ దేవి అనుగ్రహం పొందితే.. :

లక్ష్మీ దేవి అంటేనే సకల ఐశ్వర్యాలు అందించే దేవత. లక్ష్మీ దేవి కరుణ, కటాక్షం లభిస్తే ఆ వ్యక్తుల జీవితంలో ధన, ధాన్య, అదృష్ట, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందేందుకు పలు పరిహారాలు చేస్తుంటారు.

ఈ పరిహారాలతో లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు :

  • ఇంట్లో శ్రీ యంత్రం లేదా మహాలక్ష్మి యంత్రాన్ని ఉంచి పూజలు చేయాలి. తద్వారా లక్ష్మీ దేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఒకవేళ ఇది సాధ్యపడకపోతే.. ప్రతీ శుక్రవారం ఉదయం తెల్లని దుస్తులు ధరించి మహాలక్ష్మి చిత్రపటం ముందు కూర్చొని పూజలు చేయాలి. శ్రీ సూక్త పారాయణాన్ని పఠించాలి. అమ్మవారికి తామరపువ్వును సమర్పించాలి.
  • శుక్రవారం నాడు లక్ష్మీ దేవి ఆలయానికి వెళ్లాలి. అమ్మవారికి శంఖం, ఆవు పాలు, తామర పువ్వు, స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి సంతోషిస్తుంది.
  • శుభకార్యాలకు వెళ్లేవారు పెరుగు, పంచదార తిన్న తర్వాతే ఇంటి నుంచి వెళ్లాలి. ఇలా చేయడం వల్ల మహాలక్ష్మి అనుగ్రహం పొందగలరు.
  • ప్రతీ శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మి దేవితో పాటు శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. తద్వారా ఆర్థికపరమైన కష్టాలు తొలగిపోతాయి.
  • శుక్లపక్ష ఆదివారం నాడు నుదుటిపై స్వచ్చమైన కుంకుమ తిలకం దిద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ తెలుగు న్యూస్ దీన్ని నిర్ధారించలేదు.)

Also Read: MP Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్  

Also Read: Goddess Annapurna: ఇంట్లో అన్నపూర్ణ దేవీ చిత్రపటాన్ని ఈ దిశలో ఉంచితే.. ధాన్యానికి, సంపదకు ఏ లోటు ఉండదు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News