Mahasamrajya Yoga: మీన రాశిలో 'మహాసామ్రాజ్య యోగం'... ఈ 3 రాశులకు సంపదతోపాటు పురోభివృద్ధి..

Mahasamrajya Yoga: పంచాంగం ప్రకారం, మీన రాశిలో మహాసామ్రాజ్య యోగం ఏర్పడుతోంది. ఈ యోగ ప్రభావం వల్ల 3 రాశుల వారు మంచి ధనాన్ని పొందుతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2022, 03:48 PM IST
  • ఆస్ట్రాలజీలో గ్రహాల మార్పుకు ప్రాముఖ్యత ఉంది.
  • రెండు రోజుల కిందట అరుదైన యోగం ఏర్పడింది
  • ఈ 3 రాశులకు వ్యాపారంలో మంచి లాభం
Mahasamrajya Yoga: మీన రాశిలో 'మహాసామ్రాజ్య యోగం'... ఈ 3 రాశులకు సంపదతోపాటు పురోభివృద్ధి..

Mahasamrajya Yoga In Kundli: ఆస్ట్రాలజీ ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. దీని వల్ల శుభ మరియు అశుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల కిందట అంటే నవంబరు 19న మీనంలో మహాసామ్రాజ్య యోగం (Mahasamrajya Yoga) ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది.  దీని వల్ల ముఖ్యంగా మూడు రాశులవారు వ్యాపారంలో మంచి లాభం మరియు పురోగతిని సాధిస్తారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మిథునం (Gemini): మిథునంలో మహాసామ్రాజ్య యోగం ఏర్పడడం వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు సక్సెస్ కావడానికి ఏ ప్రణాళిక వేసుకున్న అందులో విజయవంతం అవుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఫ్యామిలీతో ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది. ఏదైనా వాహనం మరియు ఆస్తిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. 
కన్య (Virgo): మహాసామ్రాజ్య యోగం ఏర్పడటం మీకు శుభప్రదంగా ఉంటుంది. మీ ఆరోగ్యంలో మెరుగుదల ఉంటుంది. బిజినెస్ పెరుగుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మంచి సమయం. ఇది మీకు భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది. సంతానం లేని  దంపతులు పిల్లలు కనే అవకాశం ఉంది. జీవితంలో ఆనందం నెలకొంటుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
ధనుస్సు (Sagittarius): మహాసామ్రాజ్య యోగం ధనుస్సు రాశి వారికి వృత్తి మరియు వ్యాపార పరంగా లాభదాయకంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సమాజంలో మీ పాపులారిటీ పెరుగుతుంది. పెట్టుబడి పరంగా కూడా ఈ సమయం బాగుంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 

Also Read: Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రులు ప్రారంభం ఎప్పుడు? దీని విశిష్టత ఏంటో తెలుసుకోండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News