Makar Sankranti 2023: సంక్రాంతి రోజు అద్భుతం.. ఒకే రాశిలోకి శని-సూర్యుడు..ఈరోజు ఇలా చేస్తే మీకు డబ్బే డబ్బు..

Makar Sankranti 2023: సూర్యుడు మరియు శని గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ఈరోజు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీరిద్దరూ సంక్రాంతి రోజు ఒకే రాశిలో ఉండటం విశేషం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 09:29 AM IST
Makar Sankranti 2023: సంక్రాంతి రోజు అద్భుతం.. ఒకే రాశిలోకి శని-సూర్యుడు..ఈరోజు ఇలా చేస్తే మీకు డబ్బే డబ్బు..

Makar Sankranti Totke To Please Surya and Shani: సూర్యభగవానుడు లేకపోతే ఈ విశ్వం అంతా అంధకారమే. అలాంటి సూర్యదేవుడికి ఆస్ట్రాలజీలో చాలా ప్రత్యేకత ఉంది. సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. దీనినే సంక్రాంతి అంటారు. ఇవాళ అతడు శనిదేవుడి రాశి అయిన మకరరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మనం మకర సంక్రాంతి అంటాం. తండ్రీకొడుకుల ఆశీర్వాదాలను పొందడానికి ఈ పండుగ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి అరుదైన యాదృచ్చికం ఏర్పడింది. 

నేడు ప్రత్యేక యాదృచ్చికం
మకర సంక్రాంతి రోజున సూర్యుడు మరియు శని మకర రాశిలో ఉండటం చాలా ప్రత్యేకమైన యాదృచ్చికం. అంతేకాకుండా సంక్రాంతి ఆదివారం వచ్చింది. ఈరోజున సూర్యభగవానుడిని పూజిస్తారు. అలాగే ఈరోజు సుకర్మ మరియు ధృతి యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఇవి స్నానం, దానం చేయడానికి చాలా పవిత్రమైన యోగాలుగా భావిస్తారు. సంక్రాంతి రోజు ఉదయం నుంచి సాయంత్రం 05:46 వరకు పూజకు అనుకూలమైన సమయం.  ఈరోజున మీరు చేసే పనుల వల్ల సూర్యభగవానుడు మరియు శనిదేవుడు సంతోషిస్తారు. దీని కారణంగా మీ జీవితంలోని అడ్డంకులన్నీ తొలగిపోయి... కెరీర్ లో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. 

సంక్రాంతి రోజున ఈ చర్యలు చేయండి
**మకర సంక్రాంతి రోజున బియ్యం మరియు ఉరద్ పప్పు దానం చేయండి. ముడి బియ్యం మరియు ఉడకబెట్టిన పప్పు కూడా దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల శని కోపం పోయి అక్షయ పుణ్యం లభిస్తుంది.
**అన్నం దానం చేయడం వల్ల తరగని ఫలం లభిస్తుంది. మకర సంక్రాంతి రోజున చేసిన దానం 100 సార్లు తిరిగి వస్తుందని నమ్ముతారు.
**ఈరోజు నువ్వులను దానం చేయడం ద్వారా శని దోషం తొలగిపోతుంది. ఏడున్నర రోజులుగా బాధపడేవారు నల్ల నువ్వులను తప్పనిసరిగా దానం చేయాలి.
**నెయ్యి దానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది. ఇది జీవితంలో విజయాన్ని, పురోగతిని, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. బెల్లం దానం చేయడం ద్వారా కూడా సూర్య దేవుడు సంతోషిస్తాడు.
**నల్ల దుప్పటి దానం చేయడం వల్ల రాహు దోషం తొలగిపోతుంది.

Also read: Makar Sankranti 2023: మకర సంక్రాంతి నాడు ఈ 5 రాశులకు తిరగబడనున్న అదృష్టం, ఈ ముహూర్తంలో ఇలా చేయాలి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News