Mars Transit 2022: కుజుడి 'విపరీత రాజయోగం'... ఈ 3 రాశులవారి లైఫ్ ఛేంజ్ అవ్వడం ఖాయం..!

Mars Transit 2022:  గ్రహాలకు అధిపతి అయిన కుజుడు నవంబర్ 13 న వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా శక్తివంతమైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారు భారీగా ప్రయోజనం పొందనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2022, 10:20 AM IST
Mars Transit 2022: కుజుడి 'విపరీత రాజయోగం'... ఈ 3 రాశులవారి లైఫ్  ఛేంజ్ అవ్వడం ఖాయం..!

Mars Transit 2022:  గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిని మారుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ ప్లానెట్స్ శుభ లేదా అశుభ యోగాలను సృష్టిస్తాయి. గ్రహాలకు అధిపతి అయిన కుజుడు నవంబర్ 13 న వృషభరాశిలో (Mars Transit in Taurus 2022) సంచరించబోతున్నాడు, దీని కారణంగా శక్తివంతమైన విపరీత రాజయోగం (Powerful Vipreet Rajyog) ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  

మకరం (Capricorn): ఈ శక్తివంతమైన రాజయోగం మకరరాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే మీ సహచరుల మద్దతు మీకు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. కొత్త జాబ్ పొందే అవకాశం ఉంది. 

వృశ్చికం (Scorpio): విపరీత రాజయోగం వృశ్చికరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగం ఈ రాశి యెుక్క ఏడో ఇంట్లో ఏర్పడతుంది. దీంతో మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. పెళ్లికానీ యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా ఈ సమయం బాగానే ఉంటుంది.

మేషరాశి (Aries): మేష రాశి వారికి ఈ విపరీత రాజయోగం వల్ల భారీగా ప్రయోజనాలు కలుగుతాయి. మీ రాశి నుండి రెండో ఇంట్లో కుజుడు సంచరిస్తాడు. అంగారకుడి రాశి మార్పు వల్ల ఈ రాశివారి ఆదాయం భారీగా పెరుగుతుంది. మీరు విదేశాలకు వెళ్లే  అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 

Also Read: Shukra Gochar 2022: వృశ్చికరాశిలోకి శుక్రుడు... నవంబర్ 11 నుండి ఈ రాశులకు డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U   

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News