Mangal Gochar 2023: మరో 20 రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Mangal Gochar 2023: ప్రస్తుతం అంగారకుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు సంచారం వల్ల కొన్ని రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Last Updated : Jun 10, 2023, 01:11 PM IST
Mangal Gochar 2023: మరో 20 రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Mars Transit 2023 effect: ఆస్ట్రాలజీ ప్రకారం,  ధైర్యం, భూమి, సంపద, వివాహానికి కారకుడిగా అంగారకుడిని భావిస్తారు. ఎవరి జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. మీ కుండలిలో మార్స్ అశుభస్థానంలో ఉంటే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. మే 10న అంగారకుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈ గ్రహం జూలై 01 వరకు ఈ రాశిలోనే ఉండబోతున్నాడు. అనంతరం కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో కుజుడి సంచారం కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి
అంగారక సంచారం వల్ల  మేషరాశి వారికి మంచి రోజులు మెుదలయ్యాయి. అంతేకాకుండా మీ పనులకు ప్రశంసలు కూడా దక్కుతాయి. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు మీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం మంచిది. 
కర్కాటక రాశి
ఈ రాశిలోనే కుజుడు సంచారం జరిగింది. దీని కర్కాటక రాశివారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అంతేకాకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. 
కన్య రాశి
కన్యారాశి వారికి అంగారకుడి సంచారం శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆఫీసులో సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 

Also read: Shani Vakri 2023: 2 సూపర్ రాజయోగాలు చేస్తున్న తిరోగమన శని.. ఈ రాశులపై 4 నెలలపాటు డబ్బు వర్షం..

తులారాశి
ఈ రాశి వారికి జూలై 1 వరకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు. ఇప్పుడు పెట్టిన పెట్టుబడులు త్వరలో మీకు మంచి లాభాలను ఇస్తాయి. ఏదైనా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. 
మీనరాశి
మీన రాశి వారికి అంగారక గ్రహ సంచారం మేలు చేస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. మీకు దైర్యం పెరుగుతుంది. మీ కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 

Also Read: Mercury set 2023: ఈ నెల 19న బుధుడి అస్తమయం... ఈ 3 రాశులకు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీగా నష్టం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News