Mangal Gochar 2024: త్వరలో అంగారకుడి సంచారం.. ఫిబ్రవరిలో ఈ రాశులకు అన్నీ మంచి రోజులే..

Mangal Gochar 2024: త్వరలో అంగారకుడు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. కుజుడు సంచారం వల్ల కొందరి తలరాతలు మారబోతున్నాయి. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2024, 08:23 PM IST
Mangal Gochar 2024: త్వరలో అంగారకుడి సంచారం.. ఫిబ్రవరిలో ఈ రాశులకు అన్నీ మంచి రోజులే..

Mars Transit in Capricorn 2024: ధైర్యాన్నిచ్చే కుజుడు రాశిని మార్చబోతున్నాడు. పంచాంగం ప్రకారం, అంగారకుడు ఫిబ్రవరి 05 రాత్రి 09:07 గంటలకు మకరరాశి ప్రవేశం చేయనున్నాడు. కుజుడు రాశి మార్పు మెుత్తం 12 రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కుజుడు సంచారం ఏయే రాశులవారికి ప్రయోజనం చేకూర్చనుందో తెలుసుకుందాం. 

వృషభం: అంగారకుడు ఈరాశి యెుక్క తొమ్మిదో ఇంట్లోకి ప్రవేశించనున్నాడు. దీంతో వృషభరాశికి చెందిన వ్యాపారులు లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
కర్కాటకం: కర్కాటక రాశి యెుక్క ఏడో ఇంట్లో మార్స్ సంచారం జరగబోతుంది. ఇతరులతో సంబంధాలు బలపడతాయి. వ్యాపారస్తులు లాభపడతారు. మీకు పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీ కెరీర్ బాగుంటుంది. 
మేషం: ఈ రాశి యెుక్క 10వ ఇంట్లో కుజుడు ప్రవేశించనున్నాడు. దీంతో ఫిబ్రవరి నెల నుంచి మీకు అంతా మంచే జరగనుంది. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. మీ ఆస్తి రెట్టింపు అవుతుంది. మీ కెరీర్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు చేపట్టే ప్రతి ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. 

Also Read: Mars And Mercury Conjunction: కుజ, బుధ గ్రహాల సంయోగం.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News