Masik Durgashtami 2022: మాస/మాసిక్ దుర్గాష్టమి ఎప్పడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Masik Durgashtami 2022:  గుప్త నవరాత్రుల దుర్గాష్టమికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ రోజున దుర్గాదేవిని పూజించడం ద్వారా భక్తులు తమ కోరికలను నెరవేర్చుకుంటారు.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 30, 2022, 01:17 PM IST
  • వచ్చే నెలలో గుప్త నవరాత్రుల దుర్గాష్టమి
  • దుర్గామాతను పూజించనున్న భక్తులు
Masik Durgashtami 2022: మాస/మాసిక్ దుర్గాష్టమి ఎప్పడు? దీని ప్రాముఖ్యత ఏంటి?

Masik Durgashtami 2022: ఆషాఢ మాస దుర్గాష్టమి రోజునే గుప్త నవరాత్రుల దుర్గాష్టమి కూడా వస్తుంది. ఈ రోజున దుర్గాదేవి యెుక్క మహాగౌరీ రూపాన్ని పూజిస్తారు. దీంతో అమ్మవారు భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తుంది. ఈ సారి మాస దుర్గాష్టమి (Masik Durgashtami 2022) ఎప్పుడు వస్తుందో తెలుసుకుందాం. . 

దుర్గాష్టమి 2022 తేదీ
పంచాంగం ప్రకారం, ఆషాఢ మాసంలోని శుక్ల పక్షంలోని అష్టమి తేదీ జూలై 06 ఉదయం 10.18 గంటలకు ప్రారంభమై... జూలై 07 ఉదయం 09:58 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ఆధారంగా నెలవారీ దుర్గాష్టమిని జూలై 07న పాటిస్తారు.  

పూజా ముహూర్తం
జూలై 07, మాస దుర్గాష్టమి రోజున ఉదయం నుండి రాత్రి 11.31 వరకు శివయోగం ఉంది. ఆ తర్వాత సిద్ధయోగం ప్రారంభమవుతుంది. ఈ రోజున చిత్తా నక్షత్రం కూడా ఉంది, ఇది జూలై 08 తెల్లవారుజామున 02:44 వరకు ఉంటుంది. అదే విధంగా రవియోగం కూడా ఏర్పడుతుంది. ఇది ఇది జూలై 08 ఉదయం 02:44 నుండి 05:33 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12.31 నుండి మధ్యాహ్నం 01.31 వరకు ఉంటుంది. ఈ ముహూర్తంలో మీరు శుభ కార్యాలు చేయవచ్చు. 

పూజా విధానం
మాస దుర్గాష్టమి రోజున దుర్గాదేవి యెుక్క మహాగౌరీ రూపాన్ని పూజిస్తారు. ఈ రోజున దుర్గా చాలీసా, దుర్గా సప్తశతి, భగవత్ పురాణం మొదలైన వాటిని పఠించడం మంచిదని భావిస్తారు. దేవి అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయి.

Also Read; Sravana Masam 2022: శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభం? ఏం చేస్తే శివుడు అనుగ్రహిస్తాడు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News