Budh Gochar 2022: బుధ గ్రహ సంచారం.. ఈ రోజు నుంచి ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు!

Aquarius sign peoples will get huge money due to Mercury Transit in Libra 2022 Impact. ఈరోజు (అక్టోబర్ 26) బుధ గ్రహం తన రాశి చక్రాన్ని మార్చబోతోంది. ఈరోజు నుంచి ఈ మూడు రాశుల వారు కుబేరులు కానున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 26, 2022, 12:14 PM IST
  • బుధ గ్రహ సంచారం
  • ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
  • ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి
Budh Gochar 2022: బుధ గ్రహ సంచారం.. ఈ రోజు నుంచి ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు!

Aquarius sign peoples will get huge money due to Budh Gochar 2022 Impact: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ప్రతి గ్రహం ఓ నిర్దిష్ట సమయంలో తన రాశిని మారుస్తుంది. ఈ గ్రహ మార్పులు అన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం (మంచి లేదా చెడు) చూపుతాయి. ఈరోజు (అక్టోబర్ 26) బుధ గ్రహం తన రాశి చక్రాన్ని మార్చబోతోంది. అన్ని గ్రహాలకు రాకుమారుడు అయిన బుధుడు.. నేడు తులా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తులా రాశిలో బుధుడు ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి మేలు జరగబోతోంది. ఈరోజు నుంచి వారు కుబేరులు కానున్నారు. ఏ రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కన్యా :
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. తులా రాశిలో బుధ సంచారం కన్యా రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కన్యా రాశి వారికి డబ్బు అందే సంకేతాలు ఉన్నాయి. కన్యా రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. వ్యాపారులకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

ధనుస్సు:
తులా రాశిలో బుధుడు సంచారంతో ధనుస్సు రాశి వారి జీవితంలో భారీ మార్పు కనిపిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి కొన్ని శుభ వార్తలు అందుతాయి. ప్రతి పనిలోవి జయం సాధిస్తారు. బుధ సంచారము వలన ధనుస్సు రాశి వారికి ఆకస్మిక ధన లాభం ఉంది. ఆదాయం పెద్ద ఎత్తున పెరగవచ్చు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

కుంభం:
కుంభ రాశి వారికి బుధ సంచారం వలన శుభ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. డబ్బు సంపాదించడానికి అన్ని అవకాశాలు మీ దరికి చేరుతాయి. పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వాహనం లేదా భవనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై అందించబడింది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: భారత జట్టులో ఉన్న ఏకైక సమస్య అదే.. హుడాకు అవకాశం ఇస్తే సరిపోద్ది: గవాస్కర్

Also Read: Urvashi Rautela-Pant: ఊర్వశి ఊర్వశి అని ఎగతాళి చేసిన ఫాన్స్.. రిషబ్ పంత్ రియాక్షన్ చూస్తే నవ్వులే!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News