Sun Transit 2022: సూర్యుడి సంచారం... దీపావళికి ముందు ఈ రాశులకు బ్యాడ్ టైమ్...

Sun Transit 2022: సూర్యభగవానుడు మరో ఆరు రోజుల్లో రాశిని మార్చబోతున్నాడు. దీని వల్ల 5 రాశులవారికి కష్టాలు మెుదలుకానున్నాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2022, 07:32 AM IST
Sun Transit 2022: సూర్యుడి సంచారం... దీపావళికి ముందు ఈ రాశులకు బ్యాడ్ టైమ్...

Sun Transit 2022 Bad Effect: గ్రహాల రాజుగా పిలువబడే సూర్య భగవానుడు అక్టోబర్ 17న తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈ రోజున సూర్యదేవుడు కన్యారాశిని వదిలి తులారాశిలోకి ప్రవేశిస్తారు. దీని సంచారం కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, కొన్ని రాశులవారికి అశుభకరంగానూ ఉంటుంది. ఎవరి జాతకంలో సూర్యుడు బలమైన స్థితిలోఉంటాడో ఆ వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. ఏ వ్యక్తి కుండలిలో ఆదిత్యుడు బలహీన స్థితిలో  ఉంటాడో ఆ వ్యక్తి అనేక ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. నీటితో అర్ఘ్యంతో సమర్పిస్తే చాలు మన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు భాస్కరుడు. అలాంటి సూర్యదేవుడి సంచారం కొన్ని రాశులవారికి ఇబ్బందికరంగా ఉండనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

అన్ లక్కీ రాశులివే...
కుంభం (Aquarius): సూర్య గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారి కుటుంబ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తాయి. వీరు మానసికంగా కుంగిపోతారు. ఆఫీసులో కూడా అననుకూల వాతావరణమే ఉంటుంది. ఈ సమయంలో కొత్త పనులు, ప్రయాణాలు ప్రారంభించవద్దు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. సూర్యుడి మంత్రాలను 108సార్లు జపించడం ద్వారా ఉపశమనం పొందుతారు.  
కర్కాటకం (Cancer): ఈ రాశి వారు ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇతరులతో వివాదాలు ఏర్పడతాయి. మీ పనులను సకాలంలో పూర్తి చేయలేరు. ప్రతిరోజూ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోవద్దు. ఈ సమయంలో మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఖచ్చితంగా పెద్దల సలహా తీసుకోండి.
మేషం (Aries): వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉండదు. వ్యాపారంలో ఏదైనా కొత్త ఒప్పందం చేసుకునే ముందు, అన్ని పేపర్లను సరిగ్గా చదవండి. వైవాహిక జీవితంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఉదయాన్నే ఉదయించే సూర్యుడిని కళ్లు తెరిచి చూడండి. 

కన్య (Virgo): ఈ రాశి వారు ఆదాయానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వారి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా పనిని సకాలంలో పూర్తి చేయడంలో సమస్యలు ఉండవచ్చు. మీరు పనిచేసే చోట సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. దారిలో వెళ్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్య చెడిపోయే అవకాశం ఉంది. పరిహారం కోసం ప్రతిరోజూ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని చదవడం ప్రారంభించండి.
మిథునం (Gemini): సూర్య గ్రహ సంచారం మీ వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులను తెస్తుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉండదు. మీ కోపం పెరుగుతుంది. దాని వల్ల మీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ బ్యాడ్ టైమ్ పోవాలంటే.. ఆదివారం నాడు రాగి పాత్రలో నీటిని తీసుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. 

Also read: Mangal Gochar 2022: మరో 6 రోజుల్లో మిథునంలోకి కుజుడు.. మేషరాశిపై ఎలాంటి ప్రభావమో చూడు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News