Pournami January 2024 Date And Time: హిందూ సాంప్రదాయంలో పుష్య మాసంలో వచ్చే పౌర్ణమ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం పుష్య మాసంలోని శుక్లపక్షం పౌర్ణమి తిథి నాడు పుష్య పౌర్ణమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పురాణాల ప్రకారం ఈరోజు సూర్య భగవానుడిని పూజిస్తారు. అంతేకాకుండా ఈరోజు దానధర్మాలు చేయడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి..ఇంట్లో సుఖసంతోషాలు ఐశ్వర్యం లభిస్తుందని ఒక నమ్మకం. పుష్య పౌర్ణమి రోజు సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసి ఉపవాసాలు పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సంవత్సరం మొదటి పౌర్ణిమ ఏ రోజు వస్తుందో.. శుభ సమయం, ప్రాముఖ్యత, పూజా విధానానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పుష్య పౌర్ణమి తేదీ:
హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పుష్య పౌర్ణిమ పుష్యమాసంలోని శుక్లపక్షం జనవరి 24 రాత్రి 9 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ తర్వాతి రోజు జనవరి 24 రాత్రి 11 గంటల వరకు పుష్య మాస పౌర్ణమి తిథి కొనసాగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పుష్య మాసాన్ని జనవరి 25న జరుపుకోవడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
మొదటి పౌర్ణమి రోజే ప్రత్యేక యోగాలు:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఇదే రోజు పునర్వసు నక్షత్రం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, గురు పుష్యా యోగాలు కలవబోతున్నాయి. దీని కారణంగా పవిత్రమైన యోగాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో నదీ స్నానం చేయడమే కాకుండా దానధర్మాలు చేయడం వల్ల అనేక రకాల ఫలితాలు కలుగుతాయని వారంటున్నారు.
పుష్య పౌర్ణమి ప్రాముఖ్యత:
పుష్య మాసంలోని పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్ర లేచి నది స్నానం చేయడం ఓ ఆనవాయితీగా వస్తోంది. నది స్నానం చేసిన తర్వాత పట్టు వస్త్రాలు ధరించి సూర్యుడిని పూజించి దానధర్మ కార్యక్రమాలు చేయడం వల్ల కుటుంబంలో సమస్యలన్నీ దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి సూర్య భగవానుడి అనుగ్రహం లభించి, ఆదాయ వనరులు పెరుగుతాయి. అంతేకాకుండా పేదరికం నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం.
Also Read Hacking తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
పూజ విధి:
✦ పుష్య మాసంలోని పౌర్ణమి రోజు సూర్య భగవానుడి అనుగ్రహం పొందాలనుకునేవారు ఉదయాన్నే నిద్ర లేవాల్సి ఉంటుంది.
✦ పవిత్ర గంగానదిలో స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించాలి.
✦ ఆ తర్వాత అక్కడి సూర్యుడిని పూజించి.. సూర్య బీజాక్షరాలను జపించాల్సి ఉంటుంది.
✦ తర్వాత ఈరోజు పేదవారికి బ్రాహ్మణులకు తోచినంత సహాయం చేయాల్సి ఉంటుంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter