Shukraditya And Budhaditya Rajyog 2024 In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలకు కారకంగా సూచించే గ్రహాల్లో సూర్యగ్రహం ఒకటి. అయితే ఇటీవలే ఈ సూర్యుడు కర్కాటక రాశిలోకి సంచారం చేసింది. ఈ రాశిని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు పాలించే గ్రహంగా పేర్కొంటారు. ఇప్పటికే అదే రాశిలో శుక్రుడు కూడా సంచార దశలో ఉన్నాడు. అలాగే బుధుడు కూడా కూడా అక్కడే ఉన్నాడు. కాబట్టి ఎంతో శక్తివంతమైన శుభ యోగాలు ఏర్పడ్డాయరి జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ మూడు గ్రహాల కలయిక కారణంగా శుక్రాదిత్య రాజయోగం.. బుధుడు, సూర్యుడు కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడిందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇలా జరిగి దాదాపు 100 సంవత్సరాలకు పైగా అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ రెండు శక్తివంతమైన యోగాలు ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా లాభదాయకంగా ఉంటుందో, అత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కుంభ రాశి:
ఈ శక్తివంతమైన రెండు యోగాలు కుంభ రాశివారిపై ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి. ఈ సమయంలో అనుకున్న పనులు కూడా జరిగిపోతాయి. దీంతో పాటు కోర్టుకు సంబంధించిన అన్ని కేసులు మీకు అనుకూలంగా వస్తాయి. అంతేకాకుండా నిద్యోగ యువతకు ఉపాధి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఉద్యోగాలు చేస్తున్న యువతకు సీనియర్స్ నుంచి సపోర్ట్ లభించి కార్యలయాల్లో మంచి పేరును పొందుతారు. దీంతో పాటు వీరు కొత్త వాహనాలతో పాటు ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది., దీంతో పాటు జీవితం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది.
మిథునరాశి:
మిథున రాశివారిపై కూడా రెండు యోగాల ప్రభావం పడింది. దీని కారణంగా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో అనుకున్న కంపెనీలతో ఒప్పందాలు కూడా జరుగుతాయి. అలాగే వ్యక్తిగత జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం లభిస్తుంది. అంతేకాకుండా అదృష్టం కూడా పూర్తిగా సహకరిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయంలో బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కన్యరాశి:
ఈ యోగాల ప్రభావం కన్యా రాశివారిపై కూడా పడింది. దీని కారణంగా వీరికి అదృష్టం చాలా అనుకూలిస్తుంది. అంతేకాకుండా వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు కూడా పెడతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు కలుగుతాయి. అలాగే కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి