Rudraksha: రుద్రాక్షను పాజిటివ్ ఎనర్జీగా భావిస్తారు.. అందుకే చాలామంది దీనిని నల్లదారంతో మెడలో ధరిస్తారు. గత కొన్ని శతాబ్దాల నుంచి ఈ రుద్రాక్షను జీవితంలో వస్తున్న సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి, అనారోగ్య చికిత్సలకు వినియోగిస్తూ వస్తున్నారు. ఈ రుద్రాక్ష శివుడి కన్నీళ్ళ నుంచి పుట్టిందని పురాణాల్లో పేర్కొన్నారు. అందుకే దీనిని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. కొన్ని మతపరమైన శాస్త్రాల్లో రుద్రాక్షల గురించి ఎంతో క్లుప్తంగా వివరించారు. దీనిని ధరించడం వల్ల కలిగే లాభాలు ఎలా ధరించాలనే వివరణ కూడా తెలిపారు. అయితే రుద్రాక్షలు జరించే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మత గ్రంథాల్లో పేర్కొన్న కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. లేకుంటే ఈ రుద్రాక్ష అంతగా మీపై ప్రభావం చూపక పోయే అవకాశాలు ఉన్నాయని గ్రంథాల్లో పేర్కొన్నారు. అయితే రుద్రాక్షను ధరించే క్రమంలో పాటించాల్సిన నియమాలేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటి నియమం:
సోమవారం శివుడికి ఎంతో ఇష్టమైన రోజు..కాబట్టి ఈరోజు రుద్రాక్షను ధరించడం చాలా శుభ్రమని పురాణాల్లో తెలిపారు. దీంతోపాటు ఈ రుద్రాక్షను ధరించే సమయంలో తప్పకుండా శివ పూజ చేసి భక్తిశ్రద్ధలతో ధరించితే అది మీపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రుద్రాక్షను ధరించాలనుకునేవారు తప్పకుండా తెలుపు రంగుతో కూడిన వస్త్రాలను ధరించాల్సి ఉంటుంది.
రెండవ నియమం:
చాలామంది రుద్రాక్షను వేసుకున్న తర్వాత తరచుగా మెడలో నుంచి తీసి వేస్తూ ఉంటారు. నిజానికి ఇలా చేయడం చాలా తప్పు. ఇలా చేయడం వల్ల రుద్రాక్ష ప్రభావం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఏదైనా పరిస్థితులలో రుద్రాక్షను తీయాలనుకునేవారు దానికి సంబంధించిన మంత్రాన్ని చదువుతూ మెడలో నుంచి తీయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ వేసుకునే క్రమంలో తొమ్మిది సార్లు రుద్రాక్షను జపించి మంత్రాన్ని చదివి వేసుకోవడం చాలా శుభప్రదం.
మూడవ నియమం:
చాలామంది రుద్రాక్షకు సంబంధించిన మాలను దగ్గరుండి చేయించుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. నిజానికి రుద్రాక్షను చేయించుకునేవారు తప్పకుండా ఆ మాలలో 27, 54, 108 రుద్రాక్షలు ఉండేటట్లు చూసుకోవాలి. ఇలా బేసి సంఖ్యలో ఉండే రుద్రాక్షలను ధరించడం వల్ల మీలో ప్రతికూల శక్తి పెరుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
నాలుగవ నియమం:
చాలామంది రుద్రాక్షలను ధరించిన తర్వాత ఎవరైనా చనిపోతే స్మశాన వాటికల దగ్గరికి వెళుతూ ఉంటారు. అంతేకాకుండా ప్రకృతి గృహానికి కూడా వెళ్తారు. నిజానికి రుద్రాక్షలను ధరించి ఇలాంటి చోట్లకు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్లాలనుకుంటే తప్పకుండా రుద్రాక్షలను మెడలో నుంచి తీసి వెళ్లడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేకపోతే ఈ రుద్రాక్ష మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి