Shani Dev Puja: శనిదేవుని పూజించేటప్పుడు ఈ విషయాలు పట్టించుకోకపోతే భారీగా నష్టపోతారు!

Shani Dev Puja: శనివారం శని దేవుడిని పూజిస్తారు. శనిదేవుని అనుగ్రహం పొందాలంటే ఈ చిన్న చిన్న విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2022, 12:29 PM IST
Shani Dev Puja: శనిదేవుని పూజించేటప్పుడు ఈ విషయాలు పట్టించుకోకపోతే భారీగా నష్టపోతారు!

Shani Dev Puja: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడిని (Shani Dev) కర్మదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. మనం చేసే పనులను బట్టి శనిదేవుడు ఫలాలను ఇస్తాడు. శనిదేవుడి అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. అదే శనివక్ర దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి జీవితం సర్వనాశనమవుతుంది. కొన్ని శనిదేవుడిని  పూజించినప్పటికీ అతడి సాక్షాత్కారం మనకు లభించదు. దానికి కారణం మనం పూజలో చేసే కొన్ని తప్పులు. శనిదేవుడిని ఆరాధించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. 

ఈ విషయాలు గుర్తించుకోండి
>> శనిదేవుడికి పూజలు చేసేటప్పుడు ఆ దేవుని కళ్లలోకి నేరుగా చూడవద్దు. దీని వల్ల మీ జీవితంలో కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.
>> ఏ దేవతకైనా నైవేద్యంగా దేనినైనా పెట్టవచ్చు. కానీ శని దేవుడికి భోగ్ ఎల్లప్పుడూ నల్ల నువ్వులు మరియు ఖిచ్డీ మాత్రమే సమర్పించాలి. 
>>  దేవతామూర్తుల పూజలకు రాగి పాత్రలు అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. అయితే శని దేవుడిని పూజించేటప్పుడు రాగి పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దు.  రాగి సూర్య భగవానుడికి సంబంధించినదని చెబుతారు. సూర్యుడికి, శనికి శత్రుత్వం ఉన్న నేపథ్యంలో.. శనిదేవునికి ఇనుప పాత్రలు వాడటం మంచిది.
>>  పూజ సమయంలో అన్ని దేవతల ముందు దీపం వెలిగిస్తారు. కానీ శనిదేవుని ముందు దీపం వెలిగించడం నిషిద్ధం. శని దేవుడి విగ్రహం ముందు దీపం వెలిగించే కంటే దానిని రావిచెట్టు కింద ఉంచితే మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల శనిదేవుడు సంతోషించి మీపై వరాల జల్లు కురిపిస్తాడు. 
>>  శని దేవుడిని పూజించేటప్పుడు నలుపు మరియు నీలం రంగు దుస్తులు ధరించాలని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. 

Also Read: Shani Vakri Effect: ఈ 3 రాశులవారిపై శని వక్ర దృష్టి... 2023 వరకు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News