జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం అనేది కర్మల ప్రదాత అయిన శనిదేవుడికి అంకితం. అందుకే శనివారం నాడు విధి విధానాలతో పూజలు చేస్తే అంతా మంచిదే జరుగుతుందని విశ్వాసం. ఆ ఉపాయాలు, పద్ధతులు ఏంటనేది తెలుసుకుందాం..
హిందూమతం ప్రకారం శని గ్రహం, శని దేవుడు, శనివారం. ఈ మూడింటికీ కీలకమైన సంబంధముంది. విశేష ప్రాధాన్యత, మహ్యతమున్నాయి. అందుకే హిందూమతం ప్రకారం శనివారం అనేది కర్మల ప్రదాత అయిన శనిదేవుడికి అంకితమని చెబుతారు. ఈ క్రమంలో శనివారం నాడు పూర్తిగా భక్తి శ్రద్ధలతో, విధి విధానాలతో పూజలు చేస్తే..కొన్ని జాతకాలవారికి కటాక్షం లభిస్తుంది. దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుందని చెబుతారు జ్యోతిష్య పండితులు. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు దూరమౌతాయి.
శాస్త్రాల ప్రకారం శనిదేవుడు..మనిషి చేసే కర్మల ఆధారంగా ప్రతిఫలం ఇస్తాడు. వ్యక్తి చేసే పనిని బట్టి అతనికి ప్రతిఫలం ఉంటుంది. అందుకే శనిదేవుడిని సంతోషంగా ఉంచడం చాలా అవసరం. శనివారం నాడు పూజలతో పాటు దానధర్మాలు చేసేందుకు ప్రయత్నించాలి. మీ జీవితంలో కొన్ని సమస్యలతో సతమతమవుతున్నారంటే అర్ధం శనిదేవుడు మీపై కోపంగా ఉన్నాడని అర్ధం. అందుకే శనివారం నాడు కొన్ని ఉపాయాలతో జీవితంలో మార్పులు తెచ్చుకోవచ్చు.
శనివారం నాడు శనిదేవుడిని ప్రస్నం చేసుకునేందుకు సమీపంలోని శనీశ్వరాలయానికి వెళ్లాలి. అక్కడ ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. దీనివల్ల శనిదేవుడి ఆశీర్వాదం లభిస్తుందని అంటారు. అంతేకాకుండా..శనివారం నాడు శని చాలీసా పఠించాలి. శనివారం నాడు మాంసం తినడం, మద్యం తాగడం నిషేధం. మీ జీవితంలో తీవ్రమైన సమస్యలు వెంటాడుతుంటే..శనివారం నాడు ప్రత్యేక పూజలు చేయాల్సిందే.
శనివారం నాడు తప్పకుండా చేయాల్సిన పనులు
ఒకవేళ మీరు మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలనుకుంటే..శనివారం నాడు ఆచరించే ఈ ఉపాయంతో మీ జీవితం మారిపోగలదు. శనివారంతో పాటు మంగళవారం నాడు కూడా ఈ పద్థతి అనుసరించవచ్చు. సుప్తావస్థలో ఉన్న మీ భాగ్యాన్ని చైతన్యపర్చేందుకు శనివారం నాడు కోతులకు బెల్లం లేదా శెనగలు ఆహారంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల సౌభాగ్యం లభిస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం బుధవారం నాడు పంజరంతో సహా రామచిలుకను ఇంటికి తీసుకొచ్చి..ఎగురవేయాలి. అంటే రామచిలుకకు స్వేచ్ఛను ప్రసాదించాలి. ఈ రామచిలుక ఎంతదూరం వెళితే..మీ అదృష్టం అంతెత్తున ఎదుగుతుంది. శనివారం నాడు కూడా ఈ పని చేయవచ్చని అంటారు జ్యోతిష్య పండితులు.
Also read: Shani Dev: జనవరి 17 వరకు ఈ రాశులవారికి కష్టాలు, శనిపీడ నుండి విముక్తికి ఇలా చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook