Saturn Transit: శని శశ రాజయోగం వల్ల ఆర్థికంగా బలపడబోయే రాశులవారు వీరే! ధనమే ధనం, లాభాలే లాభాలు!

Saturn Transit In 2023: కుంభ రాశిలోకి శని గ్రహం సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో శశ అనే ప్రత్యేక యోగం ఏర్పడింది. అయితే ఈ యోగం వల్ల చాలా రాశులవారికి మంచి లాభాలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలను కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 26, 2023, 11:13 AM IST
  Saturn Transit: శని శశ రాజయోగం వల్ల ఆర్థికంగా బలపడబోయే రాశులవారు వీరే! ధనమే ధనం, లాభాలే లాభాలు!

Saturn Transit In 2023: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తుంది. శని గ్రహం కూడా అన్ని గ్రహాల్లా సంచారం చేసింది. కానీ ఈ గ్రహం ఒక్క సారి సంచారం చేస్తే రెండున్నర సంవత్సరాల పాటు ఒకే రాశిలో ఉంటుంది. సంవత్సరం జనవరి 17 శని గ్రహం కుంభ రాశిలోకి సంచారం చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఇదే క్రమంలో కుంభ రాశిలో ఇతర రాశులు కూడా సంచారం చేయడం వల్ల ప్రత్యేక త్రికోణ రాశి సంచారం ఏర్పడింది. దీని వల్ల శని శశ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం వల్ల ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారిపై శని శశ రాజయోగం ఎఫెక్ట్‌:
వృషభ రాశి: 

శని సంచారం వల్ల ఏర్పడిన శశ రాజయోగం.. వృషభ రాశి వారికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. ఈ రాశివారు కెరీర్‌లో గొప్ప విజయాన్ని సాధిస్తారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు కూడా ప్రమోషన్స్‌ పొందుతారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు పొందుతారు. వృషభ రాశివారు విదేశాలకు ప్రయాణం చేసే ఛాన్స్ కూడా ఉంది. 

మిథున రాశి: 
శశ రాజయోగం మిథునరాశి వారికి చాలా రకాల శుభ పరిణామాలను కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు శని గ్రహ సంచారం వల్ల ప్రతి పనిలో అదృష్టం పొందుతారు. వ్యాపారం కారణంగా వీరు ప్రయాణాలు చేసే ఛాన్స్‌ ఉంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే వారు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

తుల రాశి: 
శని తులారాశికి శని సంచారం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ క్రమంలో  పాత సమస్యలు దూరమవ్వడమేకాకుండా లాభాలు పొందుతారు. ఈ క్రమంలో వీరు జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆనందం పొందుతారు. ఉద్యోగంలో చేసేవారికి ఇది సరైన సమయంగా  భావించవచ్చు. 

సింహ రాశి:
సింహ రాశి వారికి శని సంచారం పెద్ద వరంగా భావించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడి, భారీ లాభాలు కూడా పొందే ఛాన్స్‌ ఉంది. 

కుంభ రాశి: 
కుంభరాశిలోకే శని సంచారం చేసింది. కాబట్టి ఈ రాశివారికి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని కుంభ రాశికి అధిపతి కావడం వల్ల శశ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశివారు ఎలాంటి కోరికలు కోరుకున్న సులభంగా నెరవేరుతాయి. 

Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News