Last Chandra Grahan 2023: చివరి చంద్రగ్రహణంతో ఈ రాశులకు మంచి కెరీర్, కావాల్సినంత డబ్బు.. మీరున్నారా?

Next Chandra Grahan 2023 Date: ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం అక్టోబరు నెలలో సంభవించబోతుంది. ఇది భారతదేశంలో కూడా కనిపించనుంది. ఈ గ్రహణం కొన్ని రాశులవారికి కలిసిరానుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 6, 2023, 04:54 PM IST
Last Chandra Grahan 2023: చివరి చంద్రగ్రహణంతో ఈ రాశులకు మంచి కెరీర్, కావాల్సినంత డబ్బు.. మీరున్నారా?

Second Chandra Grahan 2023 in India: సూర్యగ్రహణం మరియు చంద్రగ్రహణం ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. ఈ ఏడాది రెండు సూర్యగ్రహణాలు, రెండు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే ఒక సూర్య, ఒక చంద్రగ్రహణం ఏర్పడింది. మరో రెండు బ్యాలెన్స్ ఉన్నాయి.  సాధారణంగా ఈ రెండు గ్రహణాల మధ్య కేవలం 15 రోజుల తేడా మాత్రమే ఉంటుంది. ఈ ఏడాది రెండవ లేదా చివరి సూర్య, చంద్రగ్రహణాలు అక్టోబరు నెలలో సంభవించబోతున్నాయి. సూర్య గ్రహణం అక్టోబరు 14న, చంద్రగ్రహణం అక్టోబరు 28న ఏర్పడనుంది. 

2023 సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28-29 రాత్రి జరుగుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈ రోజు అశ్వినీ మాసం పౌర్ణమి. ఈ కారణంగా ఈ చంద్రగ్రహణం మరింత ప్రాముఖ్యమైనది. సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28న తెల్లవారుజామున 1:06 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:22 గంటలకు ముగుస్తుంది. అంటే ఈ చంద్రగ్రహణం మొత్తం 1 గంట 16 నిమిషాలు ఉంటుంది. 

ఇప్పుడు ఏర్పడబోయేది పాక్షిక చంద్రగ్రహణం. అయితే ఇది భారతదేశంలో కనిపిస్తుంది, కాబట్టి దాని సూతక్ కాలం చెల్లుతుంది. ఈ సమయంలో పూజలు చేయడం, ఆలయాలు తెరవడం, ఇంట్లో శుభకార్యాలు చేయడం వంటివి నిషేధం. ఈ చంద్రగ్రహణం భారతదేశంతోపాటు యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, పసిఫిక్ మహాసముద్రం, అంటార్కిటికా, ఆర్కిటిక్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, హిందూ మహాసముద్రం మరియు ఆఫ్రికాలో కనిపించనుంది. 

Also Read: Ketu Gochar 2023: కేతు సంచారంతో ఈ రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా?

ఈ చివరి చంద్రగ్రహణం కొన్ని రాశులవారిపై సానుకూలంగా, మరికొన్ని రాశులవారిపై ప్రతికూలంగా ఉండబోతుంది. ఈ రెండవ చంద్రగ్రహణం ముఖ్యంగా ధనుస్సు మరియు మిధున రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్ లో ఉన్నతస్థాయికి వెళ్తారు. అంతేకాకుండా మీరు ఆర్థికంగా బలపడతారు. 

Also Read: Mangal Gochar 2023: బుధుడు రాశిలోకి కుజుడు.. ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News