Shani Ast 2023: జనవరి 30 నుంచి అస్థిత్వం కోల్పోనున్న శనిగ్రహం, 5 రాశులకు అంతా దౌర్బాగ్యమే

Shani Ast 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం న్యాయదేవతగా భావించే శనిగ్రహం జనవరి 30 నుంచి అస్థిత్వం కోల్పోనున్నాడు. ఫలితంగా 5 రాశులకు దౌర్భాగ్యం ప్రారంభం కానుంది తస్మాత్ జాగ్రత్త అంటున్నారు జ్యోతిష్య పండితులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 25, 2023, 06:34 AM IST
Shani Ast 2023: జనవరి 30 నుంచి అస్థిత్వం కోల్పోనున్న శనిగ్రహం, 5 రాశులకు అంతా దౌర్బాగ్యమే

శని గ్రహాన్ని న్యాయదేవతగా పిలుస్తారు. హిందూ జ్యోతిష్యం ప్రకారం శని దేవుడి రంగు నలుపు. చేతిలో ధనస్సు బాణం తీసుకుని కాకిపై ప్రయాణిస్తుంటాడు. ఈ శనిగ్రహం జనవరి 30 నుంచి అస్థిత్వం కోల్పోనుండటంతో ఆ 5 రాశులకు కష్టాలు ప్రారంభం కానున్నాయి. విముక్కి పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..

చేసిన పనిని బట్టి కర్మఫలాలు ఇచ్చేది శనిగ్రహమే. కుంభం, మకర రాశులకు అధిపతి శని గ్రహం. ఇప్పుడు అంటే జనవరి 30 రాత్రి 12 గంటల 2 నిమిషాలకు కుంభ రాశిలో వక్రమార్గం పట్టనున్నాడు. ఏదైనా గ్రహం సూర్యుడికి అత్యంత సమీపంలోని వెళ్లినప్పుడు ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. ఈ స్థితిని గ్రహం అస్థితి అంటారు.  శనిగ్రహం సూర్యుడి 15వ అంశంపై ఉన్నప్పుడు అస్థిత్వం కోల్పోనుంది. ఫలితంగా అన్ని శక్తులు కోల్పోనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశుల జాతకులు వివిధ రకాల సమస్యల్ని ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ 5 రాశులేంటో పరిశీలిద్దాం..

కన్యారాశి

ఈ రాశివారికి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురౌతాయి. పనితీరులో గతంలో పోలిస్తే కొద్దిగా తగ్గుతుంది. పోటీ పరీక్షల్లో సరైన ఫలితాలు రావు. దాంతో మనస్సులో నిరాశ పెరుగుతుంది. ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లేందుకు ఆలోచిస్తున్న విద్యార్ధులు కూడా సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. మహిళ పుట్టింట్లో సమీప బంధువు ఆరోగ్యం హఠాత్తుగా చెడిపోవచ్చు.

వృషభరాశి

మీ వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సమస్యల ప్రభావం మీ వృత్తి జీవితంపై పడవచ్చు. మీలో ఆత్మ విశ్వాసం, ప్రేరణ తగ్గిపోవచ్చు. మీరు కష్టపడినదానికి తగిన ప్రతిఫలం దక్కకపోవచ్చు. తల్లిదండ్రులు ఆరోగ్యం వికటించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడమే కాకుండా మద్యమధ్యలో మెడికల్ చెకప్ చేయిస్తుండాలి. ఒకవేళ ఉద్యోగం మారాలనుకుంటే తొందరపాటు వద్దు. ప్రస్తుత సమయం మీకు అనుకూలంగా లేదు. 

కుంభరాశి

మీరు వివిధ రకాల వ్యాధులకు గురి కావచ్చు. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాలి. బయట లభించే పదార్ధాలు తినకుండా ఉంటే మంచిది. అయినవారితో వాదన పెట్టుకోవద్దు. మీ వాయిస్ మీకు సమస్యగా మారవచ్చు. వైవాహిక జీవితంలో భాగస్వామితో విభేదాలు రావచ్చు. రెండువైపుల్నించి ఘర్షణ ప్రారంభమౌతుంది. దాంతో కుటుంబం చెదిరిపోయే పరిస్థితికి దారి తీయవచ్చు. కుటుంబ వివాదాల కారణంగా మీ పని వ్యవహారాలపై పెను ప్రభావం పడుతుంది.

కర్కాటక రాశి

శని అస్థిత్వం కోల్పోవడం వల్ల మీ జీవితంలో ఎగుడు దిగుడు పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇంట్లో మూడో వ్యక్తి ప్రమేయం పెరుగుతుంది. ఫలితంగా కుటుంబ జీవితంలో ఒత్తిడి అధికమౌతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారి మధ్య విభేదాలు, నష్టాలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఎవరి మనసు నొప్పించకుండా ఉండేందుకు ప్రయత్నించండి. 

ధనస్సు రాశి

వివిధ రకాల సామాజిక కారణాలతో ఇబ్బందుల్లో పడతారు. సోదర సోదరీమణుల మధ్య సంపద విషయమై గొడవలు రావచ్చు. మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే పరస్పరం పరిష్కరించుకోవాలి. కమ్యూనికేషన్ రంగంలో పని చేస్తున్న న్యాయవాదులు, టీచర్లు, కౌన్సిలర్లు, వైద్యులు, విలేకర్లు సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.

చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందే మార్గాలు

శనిదేవత అస్థితి కారణంగా ఎదురయ్యే దుష్ప్రభావాలను దూరం చేసేందుకు కొన్ని ఉపాయాలు పాటించాలి. అన్నింటికంటే ముందు మిమ్మల్ని మీరు వ్యవస్థితుల్ని చేసుకోవాలి. ఎందుకంటే శనిదేవత అవ్యవస్థిత వ్యక్తుల్ని ఇష్టపడడు. ప్రత్యేకించి శనివారం నాడు పేదలకు భోజనం పెట్టాలి. శనివారం నాడు గుడి బయట పేదలకు అన్నదానం చేయాలి. శనివారం నాడు శని భగవానుడి ముందు ఆవనూనెతో దీపం వెలిగించారి. సోమవారం, శనివారాల్లో నల్ల నువ్వులు సమర్పించాలి. 

Also read: Shani Gochar 2023: 'రాగి' పాదాలపై శని.. ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం! రాత్రికి రాత్రే కుబేరులు అవుతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News