Shani Uday 2023: గ్రహాల పరివర్తనంలో మార్పు ఈ మానవ లోకంపై పెను ప్రభావాన్ని చూపుతాయి. ఇలాంటి ఫ్లానెట్స్ లో ఒకటి శని. ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈనెల 30న కుంభంలో శని అస్తమించాడు. మళ్లీ అతడు మార్చి 05న ఉదయించబోతున్నాడు. శనిదేవుడి యెుక్క రైజింగ్ ఏయే రాశులపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుందో తెలుసుకుందాం. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మీనం
శని ఉదయించడం మీన రాశి వారికి అననుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని దేవుడు మీ రాశి నుండి 12వ ఇంట్లో ఉదయించబోతున్నాడు. మీరు కోర్టు కేసుల్లో ఓడిపోతారు. మీ లవ్ లైదా వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తుతాయి. మీ డబ్బులు వృథా అవుతాయి. మీ ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. మీపై శనిసడే సతి కొనసాగుతుంది కాబట్టి మీ కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కోంటారు. ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
కర్కాటకం
శని దేవుడి ఉదయం మీకు హానికరం. ఎందుకంటే మీ సంచార జాతకంలో శని దేవుడు ఎనిమిదవ స్థానంలో ఉంటాడు. దీని కారణంగా మీ ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. మీ ఖర్చులు పెరుగుతాయి. మీరు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడే అవకాశం ఉంది.
వృశ్చికం
ఈ సమయంలో వృశ్చికరాశి వారి కష్టాలు పెరుగుతాయి. మీ వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. పెద్దగా లాభాలు ఉండవు. శనిదేవుడు మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఉదయించబోతున్నాడు. దీంతో మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి. మీరు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ సోదరులతో విభేదాలు రావచ్చు. మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావచ్చు.
Also Read: Amalaki Ekadashi 2023: అమలకి ఏకాదశి ఎప్పుడు? ఈరోజున ఉసిరిచెట్టును ఎందుకు పూజిస్తారు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.