Shani Asta 2024: త్వరలో అస్తమించబోతున్న శనిదేవుడు.. వీరి జీవితం అల్లకల్లోలం..

Shani Gochar 2024: వచ్చే నెలలో శనిదేవుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని కారణంగా శని వక్రదృష్టి కొందరిపై పడనుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 01:05 PM IST
Shani Asta 2024: త్వరలో అస్తమించబోతున్న శనిదేవుడు.. వీరి జీవితం అల్లకల్లోలం..

Shani Asta 2024 effect: మనం చేసే పనులను బట్టి కర్మలను నిర్ణయించే దేవుడు శని. అందుకే శనిదేవుడును కర్మఫలదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. శని వక్ర దృష్టి పడితే ఎంతటి ధనవంతుడైనా దరిద్రుడిగా మారతాడు. శని గ్రహం అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. సాధారణంగా శని స్థానంలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో ఫిబ్రవరి 11న అస్తమించబోతుంది. శని యెుక్క కదలికలో ఈ మార్పు కొందరి జీవితాల్లో అల్లకల్లోలం సృష్టించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

వృశ్చికం - అస్తమించిన శని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు జాబ్ ఛేంజ్ అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. 
ధనుస్సు- శని సంచారం వల్ల మీకు మనశ్శాంతి ఉండదు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురవుతాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. సామన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 
మకరం- శని గ్రహ గమనంలో మార్పు వల్ల మకర రాశి వారికి అననుకూలంగా ఉంటుంది. మీరు ఇతరులతో ఆచితూచి మాట్లాడాలి, లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కోంటారు. అయితే మీరు విదేశీ ప్రయాణం చేసే అవకాశం ఉంది. 
మిథునం- శని అస్తమయం మిథునరాశి వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మీరు ఎంత కష్టపడినప్పటికీ అనుకున్న ఫలితాలను పొందలేరు. మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ సమయంలో కాస్త ఓపిగ్గా ఉండాలి.  

Also Read: Love Horoscope today: ఈరోజు ఎవరి లవ్ సక్సెస్ అవుతుందో, ఎవరిది ఫట్ అవుతుందో తెలుసుకోండి..

సింహం – శని గ్రహం కదలిక మీకు కొన్ని సమస్యలను కలిగిస్తుంది. మీ మనస్సు కలత చెందుతుంది. మీ పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. మీరు ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. 
తుల: శని అస్తమించడం వల్ల వ్యాపారులు నష్టాలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమయంలో మీరు మీ ఎమోషన్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోవాలి. 

Also Read: Shri Ram Favourite Zodiac Sign: శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన రాశులవారు వీరే..ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News