Shravana Shanivaram: ఇవాళ శ్రావణ మొదటి శనివారం.. ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కోసం 4 ముఖ్య పరిహారాలు..

Shravana Shanivaram: శ్రావణ సోమవారం శివుడిని, మంగళవారం పార్వతీ దేవిని పూజించినట్లే శనివారం శని దేవుడిని పూజించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 30, 2022, 07:32 AM IST
  • శ్రావణ శనివారం శని దేవుడి పూజ
  • ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తికి పరిహారాలు
  • ఇక్కడ సూచించిన పరిహారాలతో కోర్కెలు నెరవేరుతాయి
Shravana Shanivaram: ఇవాళ శ్రావణ మొదటి శనివారం.. ఉద్యోగ, ధన, వివాహ, సంతాన ప్రాప్తి కోసం 4 ముఖ్య పరిహారాలు..

Shravana Shanivaram: శ్రావణ మాసంలో సోమ, మంగళవారాల లాగే శనివారానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. హిందూ శాస్త్రాల ప్రకారం శని దేవుడు శివుడికి శిష్యుడిగా చెప్పబడ్డాడు. కాబట్టి శ్రావణ శనివారం నాడు చేసే కొన్ని పరిహారాలకు మంచి ఫలితాలు పొందవచ్చు. శనీశ్వరుడి అనుగ్రహంతో పాటు ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కూడా సిద్ధిస్తుంది. ఇవాళ శ్రావణ మొదటి శనివారం. ధన, ఉద్యోగ, వివాహ ఇత్యాది కోర్కెలకు సంబంధించి కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి. వాటిని పాటించడం ద్వారా మీ కోర్కెలను నెరవేర్చుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం... 

ఉద్యోగం పొందాలంటే ఇలా చేయండి :

శనివారం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి రావి చెట్టు వద్ద ఆవ నూనెతో దీపం వెలిగించండి. అక్కడే కూర్చొని శని మంత్రం పఠించండి. లేదా శివ చాలీసా పఠించండి. చివరలో చెట్టుకు ఏదైనా నైవేద్యం సమర్పించి.. దాన్ని గోమాతకు తినిపించండి. వీలైతే పేదలకు దాన ధర్మాలు చేయండి. తద్వారా శని అనుగ్రహంతో మీకు ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది.

దాంపత్య జీవితానికి, సంతాన ప్రాప్తికి :

దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలతో సాగేందుకు శనివారం నాడు శివపార్వతులను పూజించాలి.  శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మారేడు దళం లేదా మారేడు పండును సమర్పించాలి. శివ చాలీసా పఠిస్తూ మనసులోనే కోర్కెలను దైవానికి నివేదించాలి. మంగళ గౌరి అయిన ఆ పార్వతి దేవి, అర్ధనారీశ్వరుడైన ఆ శివుడి అనుగ్రహంతో దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలతో పాటు సంతాన ప్రాప్తి కలుగుతుంది.

ధన లాభం కోసం ఇలా చేయండి

శనివారం నాడు వేప చెక్కతో హవనం చేస్తే సంపద సమకూరుతుంది. హోమం చేసేటప్పుడు అగ్నిలో నెయ్యిని వేస్తూ శని మంత్రాన్ని పఠించాలి. సొంతంగా హోమం చేయలేకపోతే బ్రాహ్మణ పండితుడి సహాయం తీసుకోండి. శనివారం నాడు చేసే హోమం శనీశ్వరుడి అనుగ్రహాన్ని కల్పిస్తుంది.

త్వరగా పెళ్లి కావడానికి

త్వరగా పెళ్లి కావాలని కోరుకునేవారు, పెళ్లయి అనుకోని ఆటంకాలు ఎదుర్కొనేవారు శనివారం నాడు అరటిచెట్టును పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు. పసుపు కలిపిన నీటిని అరటిచెట్టుకు సమర్పించి నెయ్యి దీపం వెలిగించి ఆరాధన చేయాలి. వీలైతే అరటిపండ్లు దానం ఇవ్వాలి. ఇలా శ్రావణ శనివారాల్లో అరటిచెట్టును పూజించడం త్వరగా వివాహ యోగం కలిగేలా చేస్తుంది. పెళ్లయి సమస్యలు ఎదుర్కొంటున్నవారికి అన్ని ఆటంకాలు తొలగిపోయేలా చేస్తుంది.

(నిరాకరణ: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Horoscope Today July 30th : నేటి రాశి ఫలాలు.. ఆస్తి సంబంధిత వివాదాల్లో ఈ రాశి వారిదే పైచేయి అవుతుంది

Also Read: New Warning on Cigarettes: సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై కొత్త వార్నింగ్.. ఇక అలవాట్లు మార్చుకోవాల్సిందే

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News