Vivah Panchami 2022: వివాహ పంచమి అనేది శ్రీరాముడు, సీతాదేవి వివాహాన్ని జరుపుకునే హిందూ పండుగ. మార్గశిర మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం వివాహ పంచమి (Vivah Panchami 2022) 28 నవంబర్ 2022 న వస్తుంది. భారతదేశం, నేపాల్ లోని మిథిల ప్రాంతంలో శ్రీ రాముడితో సంబంధం ఉన్న దేవాలయాలు, పవిత్ర స్థలాలలో సీతారాముల వివాహ వేడుకను చాలా వైభవంగా చేస్తారు.
మనదేశంలోని అయోధ్య, నేపాల్ లోని జానక్‌పూర్‌లో ఈ పెళ్లి వేడుకలు అంబరాన్నింటుతాయి. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు మనదేశం నుంచి ఎంతోమంది యాత్రికులు నేపాల్ కు వెళతారు. అందుకే ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అయితే ఈ రోజు వివాహానికి పవిత్రమైనదిగా పరిగణించబడదు. వివాహ పంచమి ముహూర్తం మరియు ఈ రోజున వివాహం ఎందుకు నిషిద్ధమో తెలుసుకుందాం.
వివాహ పంచమి 2022 ముహూర్తం
హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్గశీర్ష మాసం యొక్క శుక్ల పక్ష వివాహ పంచమి 27 నవంబర్ 2022 న సాయంత్రం 04.25 నుండి ప్రారంభమవుతుంది. పంచమి తిథి 28 నవంబర్ 2022 మధ్యాహ్నం 01:35 గంటలకు ముగుస్తుంది. అభిజిత్ ముహూర్తం - ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:36 వరకు.
వివాహ పంచమి నాడు ఏమి చేయాలి?
>> మీ వైవాహిక జీవితంలో సంతోషం ఉండాలంటే వివాహ పంచమి రోజున సీతారాములను పూజించండి.
>> ఈరోజున ముందుగా సీతారాముల చిత్రపటాలను ప్రతిష్టించి.. వారికి పూలమాల వేసి ఆరాధన చేయండి. తర్వాత రామాయణంలోని బాలకాండలో ఉన్న వివాహ సంఘటనను పఠించండి.
>>ఈ రోజున పెళ్లికాని అమ్మాయిలు ఓం జానకీ వల్లభాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే వారికి రాముడి వంటి వరుడు లభిస్తాడని చెబుతారు.
Also Read: Gajakesari Yoga: మీనంలో అరుదైన యోగం... ఈ రాశులకు ఊహించనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook