Six Planets Conjunction: మకరరాశిలోకి ఆరు గ్రహాలు.. ఈ మూడు రాశులకు చాలా ప్రమాదం!

Six Planets Conjunction in Capricorn: ఆరు గ్రహాలు మకరరాశిలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగనుంది.. అయితే కొన్ని రాశులకు మాత్రం చాలా కీడు జరుగుతుంది. మరి అవేమిటో ఒకసారి చూడండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 2, 2022, 07:59 PM IST
  • ఫిబ్రవరిలో కొన్ని గ్రహాల కలయికతో అరుదైన యోగాలు
  • మకరరాశిలోకి వచ్చేసిన సూర్యుడు, బుధుడు, చంద్రుడు, శని గ్రహాలు
  • మకరరాశిలోకి ప్రవేశించనున్న చంద్రుడు, శుక్రుడు
  • దీంతో ఏర్పడే యోగంతో కొన్ని రాశులకు ఎంతో ప్రయోజనం
Six Planets Conjunction: మకరరాశిలోకి ఆరు గ్రహాలు.. ఈ మూడు రాశులకు చాలా ప్రమాదం!

Planetary Conjunction in February: జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఫిబ్రవరిలో కొన్ని గ్రహాల కలయిక వల్ల అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే సూర్యుడు, బుధుడు, చంద్రుడు, శని గ్రహాలు మకరరాశిలోకి వచ్చేశాయి. ఇక చంద్రుడు, శుక్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించనున్నారు. ఇలా గ్రహాలన్నీ ఒకే రాశిలోకి రావడంతో పంచగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇక మరోవైపు మకరరాశిలో (Capricorn) 4 గ్రహాల కలయిక వల్ల ప్రత్యేక కేదార్ యోగం ఏర్పడనుంది. అలాగే ఈ గ్రహాలన్నీ (Planets) కలిసి షడ్గ్రహ యోగాన్ని ఏర్పరుస్తాయి. దీంతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. 

ప్రస్తుతం శని, గురు గ్రహాలు మకరరాశిలోకి వచ్చాయి. ఇక గత నెలలో సూర్యుడు, శుక్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశించారు. దీంతో మకరరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడింది. ఇక ఫిబ్రవరి 5 న శుక్రుడు, ఆ తర్వాత ఫిబ్రవరి 9న (February) చంద్రుడు కూడా మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు, బుధుడు, శుక్రుడు, బృహస్పతి, చంద్రుడు, శని గ్రహాలు కలిసి మకరరాశిలో ఉండబోతున్నాయి. దీంతో మకరరాశిలో షడ్గ్రహ యోగం ఏర్పడనుంది. ఇది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.

ఈ యోగం వల్ల 3 రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. షడ్గ్రహ యోగం వల్ల మేష, వృషభ, మీన రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగ ప్రభావంతో ఈ రాశుల వారు దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. 

అయితే ఈ 3 రాశుల (Zodiac Signs) వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మిథున, ధనుస్సు, కుంభ రాశులవారికి షడ్గ్రహ యోగం అంత శ్రేయస్కరం కాదు. వీరు అనారోగ్యానికి (Unhealthy) గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు పలు ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక నష్టాలు కూడా తలెత్తవచ్చు.

Also Read: Burning Lorry Kerala: అగ్నిప్రమాదానికి గురైన గడ్డివాము లారీ.. ప్రాణాలకు తెగించి కాపాడిన యువకుడు!

Also Read: DJ Tillu Trailer: ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోసం.. బట్టలు చించేసుకున్న అల్లు అర్జున్! అసొంటి పాటే కావాలంటూ (వీడియో)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News