Skanda Shashthi 2022: స్కంద షష్ఠి ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?

Skanda Shashthi 2022:  ఇవాళే స్కంద షష్ఠి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతానం లేని దంపతులు సంతానాన్ని పొందుతారని నమ్ముతారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 07:10 PM IST
  • జూలై 5న స్కంద షష్ఠి వ్రతం
  • పిల్లల దీర్ఘాయువు కోసం దీనిని చేస్తారు
Skanda Shashthi 2022:  స్కంద షష్ఠి ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు?

Skanda Shashthi 2022: ప్రతి నెల శుక్ల పక్షంలోని ఆరవ రోజున స్కంద షష్ఠి వ్రతం జరుపుకుంటారు. ఈ సారి స్కంద షష్ఠి ఇవాళ అనగా జూలై 5న వచ్చింది. ఈ రోజున ఉపవాసం ఉండటంతోపాటు శివుడు, పార్వతి, కార్తికేయ స్వామిని పూజిస్తారు. కార్తికేయుడిని స్కందుడు అని కూడా అంటారు. ముఖ్యంగా తల్లులు తమ పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఈ స్కంద షష్ఠి (Skanda Shashthi 2022) ఉపవాసం చేస్తారు. ఇది జూలై 4న సోమవారం సాయంత్రం 6:33లకు ప్రారంభమై... జూలై 5 రాత్రి 7:29 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా స్కంద షష్ఠి వ్రతం జూలై 5న పాటిస్తారు. 

స్కంద షష్ఠి వ్రతం ప్రాముఖ్యత
స్కంద షష్ఠి ఉపవాసం ప్రధానంగా దక్షిణ భారతదేశంలో జరుపుకుంటారు. స్కంద భగవానుని మురుగన్, కార్తికేయ మరియు సుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా సంతానం లేని దంపతులు పిల్లలు పొందుతారని హిందూ మతంలో నమ్మకం. ఈ ఉపవాసం పాటించడం వల్ల పిల్లలు దీర్ఘాయుష్షు పొందడంతోపాటు అపారమైన కీర్తిని ఆర్జిస్తారు.  స్కంద షష్ఠి వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి దురాశ, కోపం మరియు అహంకారాల నుండి విముక్తి పొందుతాడు. అంతేకాకుండా అతను తన అన్ని శారీరక బాధలు మరియు వ్యాధుల నుండి ఉపశమన లభిస్తుంది. 

Also Read: Shani Transit Effect: ఈ 2 రాశులపై శని వక్ర దృష్టి.. ఈ రెండు రాశులకు విముక్తి..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News