Janmashtami 2023 Date: హిందువులు శ్రీ కృష్ణ జన్మాష్టమిని చాలా వైభవంగా జరుపుకుంటారు. ప్రతి ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రనందు శ్రీ కృష్ణ భగవానుడి జన్మించారు. ఈరోజునే జన్మాష్టమిని జరుపుకుంటారు. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి లేదా శ్రీజగదాష్టమి అనే పేర్లుతో పిలుస్తారు. పురాణాల ప్రకారం, శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా శ్రీకృష్ణుడిని భావిస్తారు. అయితే ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం.
జన్మాష్టమి ఎప్పుడు?
ఈ ఏడాది జన్మాష్టమి తేదీ విషయంలో కొంత గందరగోళం నెలకొంది. దీనిని సెప్టెంబరు 06న జరుపుకోవాలో లేదా సెప్టెంబరు 07న జరుపుకోవాలో అర్థం కావడం లేదు. అయితే వైదిక క్యాలెండర్ ప్రకారం, జన్మాష్టమి కృష్ణ పక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 06న మధ్యాహ్నం 03:27 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 07న సాయంత్రం 04:14 గంటలకు ముగుస్తుంది. రోజున రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 06 ఉదయం 09.20 నుండి మెుదలై.. సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 10.25 వరకు ఉంటుంది. దీంతో స్మార్త సంప్రదాయం అనుసరించేవారు సెప్టెంబరు 06న జన్మాష్టమిని జరుపుకుంటే.. వైష్ణవ శాఖ వారు సెప్టెంబరు 07న చేసుకుంటారు.
శుభ సమయం
శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున బాలగోపాలుడిని పూజించే సమయం- సెప్టెంబర్ 06వ తేదీ రాత్రి 11.17 నుండి అర్ధరాత్రి 12.03 వరకు ఉంటుంది. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున కొన్ని శుభకరమైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. ఈ పవిత్రమైన రోజు హర్ష యోగం, సర్వార్థ సిద్ధి యోగం , రవియోగం రూపొందుతున్నాయి.
పూజా విధానం
జన్మాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళు, అటుకులు, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాన్ని ఉంచి ఊయలను ఊపుతూ రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. అంతేకాకుండా ఉట్లు పోటీ పెడతారు. ఉట్టిని కొట్టేందుకు యువకులు ఎగబడతారు. అందుకే ఈ పండుగని 'ఉట్ల పండుగ' లేదా 'ఉట్ల తిరునాళ్ళు' అని పిలుస్తారు.
Also Read: Rahu Transit 2023: మరో 2 నెలలాగితే ఈ 3 రాశులకు దశ తిరిగినట్టే, ఊహించని ధనలాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి