Budhaditya yogam 2023: బుధాదిత్య రాజయోగం ప్రభావం, మే 15 నుంచి ఓ నెలరోజులు ఈ 5 రాశులపై కనకవర్షం

Budhaditya yogam 2023: జ్యోతిష్యం ప్రకారం ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది.  ఒక్కోసారి రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యోగం లేదా యుతి ఏర్పరుస్తుంటాయి. అలాంటిదే ఇది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 7, 2023, 06:45 AM IST
Budhaditya yogam 2023: బుధాదిత్య రాజయోగం ప్రభావం, మే 15 నుంచి ఓ నెలరోజులు ఈ 5 రాశులపై కనకవర్షం

Budhaditya yogam 2023: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల నిర్ణీత సమయంలో నిర్ణీత రాశిలో ప్రవేశిస్తుంటాయి. అదే విధంగా గ్రహాల రాజుగా భావించే సూర్యుడు, రాజకుమారుడైన బుధుడు కలిసి గోచారంతో యోగం ఏర్పరుస్తున్నాయి. దీని ప్రభావం మొత్తం 5 రాశులపై పడుతోంది. అది ఎలా ఉండనుందో తెలుసుకుందాం..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ నెల అత్యంత ప్రాధాన్యత, మహత్యం కలగినది. ఈ నెల అంటే మే 1వ తేదీ ఉదయం 11.32 గంటలకు సూర్యుడు వృషభ రాశిలో ప్రవేశిస్తున్నాడు. దాదాపు నెలరోజులో సూర్యుడు ఇదే రాశిలో ఉంటాడు. జూన్ 15వ తేదీ సాయంత్రం 6 గంటల 7 నిమిషాలకు బుధుడు అధిపతిగా ఉన్న మిధున రాశిలో ప్రవేశిస్తాడు. అంటే ఈ నెల 15వ తేదీన గ్రహాల రాజు సూర్యుడు, రాజకుమారుడైన బుధ గ్రహాల గోచారం ఉంది.బుదుఢు మే 1న మేష రాశిలో వక్రమార్గం పట్టనున్నాడు. బుధుడు, సూర్య గ్రహాలు సమీపంలో రావడం బుధాదిత్య యోగానికి కారణమౌతున్నాయి. బుధుడు మేష రాశిలో ప్రవేశించడం అందరికీ అనుకూలంగా ఉంటుంది. 

కన్యా రాశి

సూర్యుడి గోచారం కారణంగా మీ లోపల ఆధ్యాత్మికత పెరుగుతుంది. మతం, ఆధ్యాత్మికత వైపుంటారు. ఫలితంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో ఏదైనా పూజాది కార్యక్రమం నిర్వహించవచ్చు. ఈ గోచారం సందర్భంగా తీర్ధయాత్రలకు వెళ్లే అవకాశాలుంటాయి. విదేశాల్లో ఉండేవారికి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేవచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తుంది.

కర్కాటక రాశి

బుధాదిత్య యోగం కారణంగా మీ ప్రతి కోరిక పూర్తవుతుంది. అనుకున్నవన్నీ పూర్తవుతుంటాయి. ఉన్నతాధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఫలితంగా చాలావరకూ పనులు సులభంగా జరిగపోతుంటాయి. దీర్ఘకాలంగా ఉన్న కోర్కెలు ఫలిస్తాయి. వాహన యోగం కలుగుతుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. అటు ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

మేష రాశి

సూర్య, బుధ గ్రహాల గోచారం మీ స్థాయిని, సామర్ధ్యాన్ని పెంచుతుంది. మేషరాశి జాతకుల్లో విద్యార్ధులకు అత్యంత అనువైనది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. కెరీర్ పరంగా మంచి ఫలితాలు లభిస్తాయి. పనిచేసే చోట గౌరవం దక్కుతుంది. ఆర్ధికంగా పరిస్థితి మెరుగుపడవచ్చు. కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశముంది. 

ధనస్సు రాశి

సూర్య, బుధ గ్రహాల గచారంతో మీ ప్రత్యర్దులపై విజయం లభిస్తుంది. శారీరక బలహీనత దూరం చేసేందుకు యోగా, ధ్యానం, వ్యాయామంపై దృష్టి సారించాలి. అంటే ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. చాలాకాలంగా ఉన్న కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారమౌతాయి. మీ నడవడిక అందరికీ ఆదర్శం కాగలదు. ఎప్పటి నుంచో నిలిచిపయిన డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగస్తులకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. 

సింహ రాశి

సూర్య, బుధ గ్రహాల యోగం సింహ రాశి జాతకులపై విశేష ప్రభావం చూపించనుంది. సూర్యుడు సింహ రాశికి అధిపతి అయినందున ప్రభుత్వ ఉద్యోగం కోసం అణ్వేషించేవారికి అత్యంత అనుకూలమైన సమయంగా ఉంటుంది. కీలకమైన శాఖలో ప్రభుత్వ ఉద్యోగం లభిస్తుంది. పనిపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రత్యర్దులకు హాని చేకూరే సమయమిది. ఆర్ధికంగా మంచి స్ఖితిలో ఉంటారు. కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 

Also read: Sun Transit 2023: వృషభ సంక్రాంతితో ఈ రాశుల జీవితం మారిపోనుంది.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News