Surya Gochar 2023: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాలు రాజు అని పిలుస్తారు. మే 14న సూర్యభగవానుడు మేషరాశిని విడిచిపెట్టి వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే వృషభ సంక్రాంతి (Vrishab Sankranti) అంటారు. ఆదిత్యుడు ప్రతి నెలా రాశిని మారుస్తాడు. సంవత్సరం మెుత్తం మీద 12 రాశులలో సంచరిస్తాడు. ఆత్మ, గౌరవం మరియు విజయానికి కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. సూర్య సంచారం ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
సూర్య సంచారం ఈ రాశులకు వరం
సింహరాశి: ఈరాశికి అధిపతిగా సూర్యుడిని భావిస్తారు. బిజినెస్ చేసేవారు మంచి లాభాలను పొందుతారు. మీ కెరీర్ మునుపటి కంటే బలపడుతుంది. ఫ్యామిలీలో సంతోషం ఉంటుంది. డబ్బును ఆదా చేస్తారు. ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
మేషరాశి: సూర్యుడి సంచారం మేషరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
కన్యారాశి: సూర్యుడి రాశి మార్పు కన్యారాశి వారికీ మేలు చేస్తుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అనుకోని ధనలాభం కలుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
Also Read: Chandra Gochar 2023 : గ్రహణం తర్వాత 4 రాశులలో చంద్రుడి సంచారం.. వీరికి ఆకస్మిక ధనలాభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook