Samsaptaka yogam 2023: సూర్య-శని గ్రహాలతో ఏర్పడిన సంసప్తక యోగం, ఆ మూడు రాశులపై ఊహించని ధన సంపదలు

Samsaptaka yogam 2023: హిందూ మత విశ్వాసాల  ప్రకారం  ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. అదే సమయంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. దీనినే గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనంగా భావిస్తారు. ఈ ప్రభావం వివిధ జాతకాలపై కచ్చితంగా ఉంటుంది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 23, 2023, 06:43 AM IST
Samsaptaka yogam 2023: సూర్య-శని గ్రహాలతో ఏర్పడిన సంసప్తక యోగం, ఆ మూడు రాశులపై ఊహించని ధన సంపదలు

Samsaptaka yogam 2023: జ్యోతిష్యం ప్రకారం సూర్యుడిని గ్రహాలకు రారాజుగా, బుధుడిని యువరాజుగా, శని గ్రహాన్ని న్యాయ దేవతగా పిలుస్తారు. అదే సమయంలో సూర్యుడు-శని మధ్య తండ్రీ కొడుకుల బంధముంటుందనేది జ్యోతిష్య శాస్త్రం చెప్పే మాట.

సూర్యుడు ప్రస్తుతం తన స్వరాశి సింహంలో ఉంటే..శని గ్రహం కుంభ రాశిలో ఉంది. ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండటం వల్ల అత్యంత మహత్యం కలదిగా భావించే సంసప్తక యోగం ఏర్పడింది. సంసప్తక యోగం అనేది సహజంగానే కొన్ని రాశులకు నష్టాన్ని కల్గిస్తే కొన్ని రాశులకు అమితమైన లాభాల్ని అందించనుంది. ముఖ్యంగా మూడు రాశుల అదృష్టాన్ని తిరగరాయనుంది. ఈ సమయంలో ఆ మూడు రాశులకు ఊహించని ప్రయోజనాలు అందనున్నాయి. ఎందుకంటే సూర్య, శని గ్రహాల మధ్య సంబంధాన్ని బట్టి ఆ రెండు గ్రహాలు ఎదురెదురు కావడం అత్యంత ప్రాధాన్యత కలదిగా జ్యోతిష్య పండితులు భావిస్తారు. 

సూర్య, శని గ్రహాల ఎదురెదురు పరిణామంతో ఏర్పడే సంసప్తక యోగం కర్కాటక రాశి జాతకులకు ఆర్ధికంగా పటిష్టం చేయనుంది. పూర్వీకుల ఆస్థి దక్కవచ్చు. వ్యాపారులకు అత్యంత అనువైన సమయం. ఎందుకంటే కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలతో పాటు ఆదాయ మార్గాలు తెర్చుకుంటాయి. పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్ధులు కష్టపడితే మరిన్ని ఫలితాలుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

సంసప్తక యోగం ప్రభావం మేష రాశి జాతకులపై అత్యద్భుతంగా ఉండనుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్య సమస్యలుంటే దూరమౌతాయి. సంతానం విషయంలో శుభవార్త వింటారు. ఆదాయం పెరగడంతో ఆర్ధికంగా మంచి స్ఠితిలో ఉంటారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే అత్యంత అనువైన సమయం. సంసప్తక యోగం ప్రభావంతో కెరీర్ అద్భుతంగా మల్చుకోవచ్చంటున్నారు జ్యోతిష్యలు.

సూర్య, శని గ్రహాల మద్య ఉండే తండ్రీ కొడుకుల బంధం కారణంగా ఈ రెండు గ్రహాలు ఎదురెదురైతే సంసప్తక యోగం ఏర్పడుతుంది. ఈ యోగం ప్రభావంతో సింహ రాశి జాతకులకు అందరికంటే ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయి. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పనులు చిటికెలో పరిష్కారమైపోతాయి. ఉద్యోగస్థులకు బాగుంటుంది. ఇంక్రిమెంట్లు, పదోన్నతి లభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు దూరమౌతాయి.

Also read: Budh Vakri 2023: బుధుడి తిరోగమనంతో ఈ రాశుల వారికి తీవ్ర కష్టాలు మొదలవ్వబోతున్నాయి! తస్మాత్‌ జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News