Sun Transit 2023: ఈ నెల 17 నుంచి ఈ రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి!

Sun Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సూర్యగ్రహం ఈనెల 17వ తేదీన రాశి సంచారం చేయబోతోంది. ఈ సంచార ప్రభావం కొన్ని రాశుల వారిపై ప్రత్యక్షంగా పడబోతోంది. ఈ ప్రభావం కారణంగా కొన్ని రాశుల వారు సుఖాలను అనుభవిస్తే.. మరికొన్ని రాశుల వారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 10, 2023, 09:16 PM IST
Sun Transit 2023: ఈ నెల 17 నుంచి ఈ రాశుల వారి జీవితాలు పూర్తిగా మారబోతున్నాయి!

Sun Transit 2023: ఆగస్టు 17న కర్కాటక రాశి నుంచి సూర్యగ్రహం సింహరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. క్రమంలో కొన్ని రాశుల వారికి మంచి జరిగితే మరికొన్ని రాశుల వారికి నష్టాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది.

✤ జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహం సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని అందరికీ తెలిసిందే. వ్యక్తుల జాతకాల్లో సూర్యుడు అనుకూల స్థానంలో ఉంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.

✤ ఆగస్టు 17వ తేదీన జరిగే సూర్య గ్రహ సంచారం..మిథున రాశి వారిపై ప్రత్యేక ప్రభావం చూపబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో మిథున రాశి వారికి ప్రశాంతత లభించడమే కాకుండా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఇక విదేశాల్లో చదవాలనుకునే వారి కోరిక కూడా సులభంగా నెరవేరుతుంది.

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!   

✤ కర్కాటక రాశి వారు సూర్యుని సంచారం కారణంగా కొన్ని ఇబ్బందుల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో వీరు కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర ఇబ్బందుల బారిన పడతారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ క్రమంలో స్నేహితుల మద్దతు లభించి మంచి ఫలితాలు పొందుతారు.

✤ సూర్య గ్రహ సంచారం మేష రాశి వారిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ క్రమంలో మేష రాశి వారికి చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్నవారు కోపాన్ని నియంత్రించుకుంటే చాలా మంచిది లేకపోతే.. ఇరుకున పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

✤ వృషభ రాశి వారు సూర్యుడి సంచార క్రమంలో కష్టపడి పనిచేయడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా మీరు కోపాన్ని నియంత్రించుకుంటే చాలా మంచిది. ఇక వ్యాపారాలు చేస్తున్న వారి విషయానికొస్తే.. ఈ సంచార సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండటం చాలా మంచిది. లేకపోతే నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News