Sun Transit 2023: ఇవాళే సూర్య గోచారం, ఈ మూడు రాశులకు కొత్త ఉద్యోగాలు, ధనలాభం

Sun Transit 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాలకు, రాశులకు అమితమైన ప్రాధాన్యత, మహత్యముంటాయి. జ్యోతిష్యం ప్రకారం ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో గోచారం చేస్తుంటుంది. ఫలితంగా అన్ని రాశులపై ప్రభావం పడుతుంటుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 17, 2023, 05:44 AM IST
Sun Transit 2023: ఇవాళే సూర్య గోచారం, ఈ మూడు రాశులకు కొత్త ఉద్యోగాలు, ధనలాభం

Sun Transit 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తుంటారు. అదే విధంగా సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. అందుకే సూర్యుడి రాశి పరివర్తనం ప్రబావం అత్యంత కీలకం కానుంది. సూర్యుడు ఇవాళ అంటే సెప్టెంబర్ 17న కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. ఫలితంగా మూడు రాశులకు కీలకం కానుంది. ఆ వివరాలు మీ కోసం..

గ్రహాల రాజుగా భావించే సూర్యుడు ఎప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినా..ఆ ప్రభావం నేరుగా మనిషి జీవితంపై పడుతుంది. ఈ రాశి జాతకులపై సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం గణనీయంగా ఉండనుంది. సూర్యుడు సింహ రాశిని వదిలి కన్యా రాశిలోకి ఇవాళ గోచారం చేయనున్నాడు. అక్టోబర్ 17 వరకూ సూర్యుడు ఇదే రాశిలో ఉంటాడు., ఫలితంగా మేషం, వృషభం, మిథున రాశుల కెరీర్‌కు ప్రయోజనం కలగనుంది. 

వృషభ రాశి జాతకులకు కెరీర్‌పరంగా కచ్చితంగా బాగుంటుంది. తగిన నిర్ణయాలు తీసుకోగలరు. ఉన్నత పదవుల్లో ఉండేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండనుంది. శక్తి సామర్ధ్యాలు మరింతగా పెరగనున్నాయి. అన్ని సమస్యలు దూరమౌతాయి. ఉద్యోగం మారేందుకు లేదా వ్యాపారం పెంచుకునేందుకు ఇది అత్యంత అనువైన సమయంగా భావిస్తారు. పనిచేసే సంస్థలో ఏదైనా సమస్య ఉంటే అది తొలగిపోతుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది.

సూర్యుడు కన్యా రాశిలో గోచారం చేయడం వల్ల మిధున రాశి జాతకులకు ఉద్యోగపరంగా బాగుంటుంది. పెద్ద పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు రావచ్చు. మీడియాలో పనిచేసేవారికి సంబంధ బాంధవ్యాలు పటిష్టమౌతాయి. ఏదైనా పని విషయంలో వెనుకంజ వేస్తుంటే ఆ ఇబ్బంది ఇప్పుడు తొలగిపోవచ్చు. ఉద్యోగంలో పదోన్నతి, లాభాలు ఉంటాయి. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉండవచ్చు. వ్యాపారులకు అనువైన సమయం. ధనలాభం కలుగుతుంది. 

మేష రాశి జాతకులు కష్టపడితే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఈ జాతకులు ఎంత కష్టపడితే అంతగా లాభాలుంటాయి. ఉద్యోగం, వ్యాపారం, చదువుకు సంబంధించిన రంగాల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఆదాయం పెరగడంతో ఆర్ధిక పరిస్థితి పటిష్టంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడవచ్చు.

Also read: Rajyogam: బుధాదిత్య రాజయోగంతో ఈ రాశులకు కావాల్సినంత డబ్బు.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News