Sun Transit 2022: గ్రహాల రాజు అయిన సూర్యుడు తన ఇంట్లో అంటే సింహరాశిలో నెల రోజులు ఉండి ఇవాళ తన రాశిని మార్చుకుంటున్నాడు. సూర్యుడి తదుపరి స్టాప్ కన్యారాశి. ఈరోజు అంటే సెప్టెంబరు 17న ఆదిత్యుడు కన్యారాశిలోకి ప్రవేశించి (Sun transit in virgo 2022) నెల రోజులపాటు ఇక్కడే బస చేయనున్నారు. దీనినే కన్యా సంక్రాంతి అంటారు. సూర్యుడి యెుక్క ఈ మార్పు ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
మేషం (Aries)- ఈ రాశి వారు ఈ సమయంలో తమ యజమానితో ఎటువంటి గొడవ పెట్టుకోకండి, లేకుంటే మీరే నష్టపోతారు. బాస్ ఆదేశాన్ని పాటించండి. ఈ కాలంలో ఎటువంటి అక్రమ పనులు చేయవద్దు.
వృషభం (Taurus)- ఈ రాశివారి కెరీర్ లో అనుహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. మీపై అధికారులతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది, కాబట్టి మీరు అతనితో మంచి సంబంధాలను కొనసాగించండి. అప్పుడే మీరు ప్రయోజనం పొందుతారు.
మిథునం (Gemini)- వీరు తమదైన రంగంలో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో మీ పనిని మంచిగా చేస్తూ ఉండండి.
కర్కాటకం (Cancer)- ఈ రాశి మరియు లగ్నానికి చెందిన వ్యక్తులు ఎటువంటి సవాళ్లనైనా అధిగమిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. శ్రమతో కూడిన విజయం లభిస్తుంది. ఆఫీసులో మీ సీనియర్ మద్దతు లభిస్తుంది.
సింహం (Leo)- ఈ సమయంలో ఇతరుల మనసు నొప్పించకుండా నడుచుకోండి. ఎటువంటి పరుష పదజాలం ఉపయోగించవద్దు. ఆఫీసులో మీ పట్ల వ్యతిరేకత రావచ్చు, జాగ్రత్తగా ఉండండి.
తుల (Libra)- విదేశాలకు వెళ్లాలనే ఈ రాశివారికి కోరిక నెరవేరుతుంది. వీరు ఉన్నత విద్య కోసం లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఫారిన్ వెళ్లే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి (Scorpio)- సూర్యుని సంచారం వల్ల ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగార్థులు తమ పై అధికారుల సహకారంతో జీవితంలో ముందుకు సాగుతారు మరియు లాభాలను కూడా పొందుతారు. బాస్‌తో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా మీకు ప్రమోషన్ రావచ్చు, జీతం పెరగవచ్చు.
ధనుస్సు (Sagittarius)- సూర్యుని అనుగ్రహం వల్ల ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో మీ ఫ్లేస్ సుస్థిరమవుతుంది. ఉద్యోగులు ట్రాన్స్ ఫర్ అయ్యే అవకాశం ఉంది.
మీనం (Pisces)- ఉద్యోగాలు చేసే వారికి ఈ కాలంలో కొన్ని శుభవార్తలు అందుతాయి. పదోన్నతి పొందుతారు లేదా జీతం పెరుగుతారు. మీరు పర్మినెంట్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: Budhaditya Yog 2022: కన్యారాశిలో బుధాదిత్య యోగం... ఈ రాశులవారికి జాక్ పాట్ ఖాయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook