Sun Transits 2024: సొంత రాశిలోకి సూర్యగ్రహం.. ఈ రాశులవారికి గోల్డెన్‌ లైఫ్ ప్రారంభం!

Sun Transits Into Leo 2024: ఆగష్టు 16న సూర్యగ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సొంత రాశి అయిన సింహ రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారు విపరీతమైన లాభాలు పొందుతారు.  

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Aug 23, 2024, 11:22 AM IST
Sun Transits 2024: సొంత రాశిలోకి సూర్యగ్రహం.. ఈ రాశులవారికి గోల్డెన్‌ లైఫ్ ప్రారంభం!

 

Sun Transits Into Leo 2024: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహాల కంటే సూర్యగ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రాజుగా భావిస్తారు. అయితే ఈ గ్రహం ప్రతి నెల రాశి సంచారం చేస్తాడు. ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడానికి ఈ గ్రహానికి దాదాపు 30 రోజుల పాటు సమయం పడుతుంది. ఈ గ్రహం ఒక సంవత్సరంలో 12 సార్లు సంచారం చేస్తుంది. ఇదిలా ఉంటే ఆగష్టు 16న సూర్య గ్రహం కర్కాటక రాశిని వదిలి సింహ రాశిలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఈ గ్రహం సింహ రాశి నుంచి కన్య రాశిలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా మూడు రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సంచారం ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
కర్కాటక రాశి:

సింహ రాశిలోకి సూర్యుడు సంచారం చేయడం వల్ల కర్కాటక రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు పూజలపై ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా జీతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే సూర్యుడి అనుగ్రహం లభించి విపరీతమైన ధన లాభాలు పొందుతారు. 

సింహ రాశి:
సింహ రాశివారికి సూర్యుడి అనుగ్రహం లభించి అద్భుతమైన శక్తిని పొందుతారు. అంతేకాకుండా అదృష్టాన్ని పొంది ఎలాంటి పనులైనా సులభంగా చేయగలుగుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేస్తారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. 

వృశ్చిక రాశి:
వృశ్చిక రాశివారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కూడా పొందుతారు. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా చేస్తారు. దీంతో పాటు ఉద్యోగాలు చేస్తేన్నవారు కూడా ఊహించని ప్రమోషన్స్‌ పొందుతారు. దీంతో పాటు పెడింగ్‌లో పనులు కూడా పూర్తవుతాయి. అంతేకాకుండా విద్యార్థులు కూడా ఈ సమయంలో గుడ్ న్యూస్‌ వింటారు. ఈ సమయం వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News