Chaitra Navratri 2023 Grah Gochar: హిందూమతంలో నవరాత్రులకు చాలా విశిష్టత ఉంది. ఈ పండుగ తొమ్మిది రోజులు దుర్గాదేవి యెుక్క 9 రూపాలను పూజిస్తారు. చైత్ర నవరాత్రులు మార్చి 22 నుండి మెుదలుకానున్నాయి. ఇవి ఈనెల 30 వరకు ఉంటాయి. ఈ పండుగ రోజున 5 గ్రహాల కలయిక ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు, గురుడు, బుధుడు మరియు నెప్ట్యూన్ మీనరాశిలో ఉంటారు. అంతేకాకుండా ఇదే రోజు బుధాదిత్య యోగం, గజకేసరి యోగం, హన్స్ యోగం ఏర్పడుతున్నాయి. ఈ చైత్ర నవరాత్రులు ఏ రాశుల వారికి శుభప్రదమో తెలుసుకుందాం.
చైత్ర నవరాత్రులు ఈ రాశులకు శుభప్రదంగా మారబోతున్నాయి:
మిథునం: గ్రహాల గొప్ప కలయిక మిథునరాశి వారికి కెరీర్‌లో కొత్త అవకాశాలను ఇస్తుంది. కొత్త ఉద్యోగం, పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో లాభం, పురోగతి ఉంటుంది. ఇంట్లో ఆనందం వెల్లివిరిస్తుంది. శుభవార్తలు వింటారు.
కర్కాటకం: ఈ గ్రహాల కలయిక కారణంగా కర్కాటక రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది.
కన్య: మీనరాశిలో 5 గ్రహాల సంయోగం కన్యారాశి వారికి బలమైన ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవగకాశం ఉంటుంది.
వృశ్చికం: ఈరాశి వారు వ్యాపారంలో భారీగా లాభాలు పొందుతారు. అంతేకాకుండా పెద్ద డీల్ ను ఫైనల్ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఈ సమయం బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. పెట్టుబడికి ఇదే మంచి సమయం.
మీనం: సూర్యుడు, బుధుడు, గురుడు, చంద్రుడు మరియు నెప్ట్యూన్ గ్రహాలు ఇదే రాశిలోనే కలిసి ఉండటం వల్ల మీనరాశివారు మంచి ప్రయోజనాలు పొందుతారు. పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరుల ఏర్పడతాయి. భారీగా ధనం లభిస్తుంది. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది.
Also Read: Budh Gochar 2023: 'నీచభంగ రాజయోగం' చేస్తున్న బుధుడు.. ఈ 3 రాశులకు తిరుగులేదు గురూ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook