Surya Grahan 2022: ఈ గ్రహణం అన్ని సూర్యగ్రహణాల కంటే శక్తి వంతమైంది.. కాబట్టి తప్పకుండా ముగిసిన తర్వాత ఇలా చేయాలి..

Surya Grahan 2022: ఈ రోజు ఏర్పడబోయే సూర్యగ్రహం ఎంతో శక్తి వంతమైనది. కాబట్టి సూర్యగ్రహణం ముగిసిన తర్వాత జోతిష్య శాస్త్రంలో పేర్కొన్న పలు రకాల పనులు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఎలాంటి చెడు ప్రభావమైన సులభంగా తొలగిపోతుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 06:32 PM IST
  • ఈ గ్రహణం అన్ని సూర్యగ్రహణాల కంటే శక్తి వంతమైంది..
  • కాబట్టి తప్పకుండా ముగిసిన..
  • తర్వాత జోతిష్య శాస్త్రం పేర్కొన్న ఈ పనులు చేయాలి.
Surya Grahan 2022: ఈ గ్రహణం అన్ని సూర్యగ్రహణాల కంటే శక్తి వంతమైంది.. కాబట్టి తప్పకుండా ముగిసిన తర్వాత ఇలా చేయాలి..

Surya Grahan 2022: ఈ రోజు ఏర్పడబోయే సూర్యగ్రహణం ఒక అశుభకరమైన సంఘటనగా జోతిష్య శాస్త్రం పరిగణించింది. ఈ రోజు(మంగళవారం) పూజలు, శుభకార్యాలు చేయడం నిషేధించారు. సూర్యగ్రహణం సమయంలో సూర్యభగవానుడితో పాటు ఇతర దేవుళ్లను స్మరించుకోవాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 2022 సంవత్సరంలో ఏర్పడిన సూర్య గ్రహాణాలకంటే ఈ రోజు ఏర్పడబోయే గ్రహణం చాలా శక్తి వంతమైనది. అంతేకాకుండా ఈ సంవత్సరంలో చివరి గ్రహం కాబట్టి ఈ గ్రహాణానికి చాలా ప్రత్యేక ఉంది. ఈ గ్రహణం అన్ని దేశాల్లా కాకుండా భారత్‌లో అక్టోబర్ 25 సాయంత్రం 4:22 గంటలకు ప్రారంభం కాబోతోంది.  

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం శాస్త్రం నిషేధించింది. గ్రహణం తర్వాత వెంటనే కొన్ని పనులు చేయడం చాలా ముఖ్యమని శాస్త్రం సూచిస్తోంది.  సూర్యగ్రహణం సమయంలో ప్రతికూల శక్తి వస్తుందని ఈ శక్తి నుంచి విముక్తి  పొందడానికి పలు రకాల పనులు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఎలాంటి పనులు చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..  

గ్రహణం ముగిసిన తర్వాత అందరూ ఈ మంత్రాలను పాటించాల్సి ఉంటుంది:

సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఈ పనులు తప్పకుండా చేయాలి ఎందుకో తెలుసా..?:
>>సూర్యగ్రహణం ముగిసిన తర్వాత తులసి మొక్కపై గంగాజలం చల్లి శుద్ధి చేయాలి.
>> ఇంట్లో మీరు పూజించే విగ్రహాలపై కూడా గంగాజలం చల్లి శుభ్రం చేయాల్సి ఉంటుంది.
>>అంతేకాకుండా ఇంట్లోని పూజా స్థలంలో లేదా పూజించే స్థలంలో గంగాజలాన్ని చల్లుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి ఇంట్లో నుంచి తొలగిపోతుందని శాస్త్రం చెబుతోంది.
>>ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రహణం కారణంగా వచ్చే ప్రతికూల శక్తి గర్భిణీలకు పుట్టబోయే బిడ్డపై పడుతుందని శాస్త్రం చెబుతోంది. కాబట్టి వీరు గ్రహణం తర్వాత తప్పకుండా తల స్నానం చేయాల్సి ఉంటుంది.
>>జ్యోతిష్యం ప్రకారం గ్రహణం తర్వాత నువ్వులు, శనగ పప్పులను పేదవారికి దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
>>సూర్యగ్రహణం ముగిసిన తర్వాత ఇంటిని తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ తొలగిపోతుంది.
>>గ్రహణం తర్వాత స్నానంతో పాటు దానధర్మాలకు కూడా విశేష ప్రాధాన్యం ఇచ్చింది జోతిష్య శాస్త్రం. కాబట్టి మీకు చేతనైనంత దానం చేయడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.
>>స్నానం చేసేటప్పుడు నీటిలో గంగాజలం కలపుకుని తల స్నానం చేస్తే ప్రతికూల ప్రభావాలు తొగిపోతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
>>ఇలా గ్రహణం ముగిసిన తర్వాత తల స్నానాలు చేసి దేవతలను దర్శించుకోవాల్సి ఉంటుంది.

 

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE TELUGU NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?

Also Read: Diwali Muhurat Trading 2022: దీపావళి ముహూర్తం ట్రేడింగ్ అంటే ఏంటి ? ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహిస్తుందా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News