Sai Baba: గురువారం రోజున సాయిబాబాను ఇలా పూజించండి.. మీ కోరికలు నెరవేర్చుకోండి!

Shirdi Sai Baba: గురువారం సాయిబాబాను పూజిస్తారు. ఈరోజున భక్తితో బాబాను పూజించడం వల్ల మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. సాయిబాబా పూజా విధానం గురించి తెలుసుకోండి.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2022, 12:49 PM IST
Sai Baba: గురువారం రోజున సాయిబాబాను ఇలా పూజించండి.. మీ కోరికలు నెరవేర్చుకోండి!

Sai Baba Puaj tips: ప్రపంచవ్యాప్తంగా షిర్డీ సాయిబాబాకు (Shirdi Sai Baba) ఎంతోమంది భక్తులు ఉన్నారు. చాలా మంది షిరిడీ యాత్రకు వెళ్తుంటారు. గురువారం సాయిబాబాను పూజిస్తారు. ఈ రోజున ఉపవాసం ఉండి.. భక్తితో సాయిబాబాను పూజిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుస్తాడు. కనీసం 9 గురువారాలు ఉపవాసం (9 Weeks vratam) ఉంటే పుణ్యం వస్తుందని నమ్ముతారు. 

సాయిబాబా పూజ విధానం
>> గురువారం బ్రహ్మ ముహూర్తంలో లేచి.. స్నానం చేయండి. అనంతరం బాబాను ధ్యానించండి. తర్వాత  ఉపవాసం చేస్తూ.. బాబాను పూజించండి. 
>> సాయిబాబాకు పసుపు రంగు ఎంతో ఇష్టం. కాబట్టి గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించండి. 
>> బాబా విగ్రహాన్ని గంగాజలంతో శుభ్రం చేసి పూజలో పెట్టండి. దానిపై పసుపు రంగు వస్త్రం కప్పండి. 
>> బాబాను పువ్వులతో అలకరించించి.... నైవేద్యంగా లడ్డూలు పెట్టండి. ధూపం వేసి..హారతి ఇవ్వండి.
>>  సాయిబాబా కథను చదవి వినిపించండి.  అనంతరం ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టండి. 
>> గురువారం నాడు మీకు ఉన్నదాంట్లో ఎంత వీలైతే అంత దానం చేయండి.

సాయిబాబా వ్రత విధానం
సాయిబాబా అనుగ్రహం పొందడానికి భక్తులు తొమ్మిది రోజులుపాటు ఉపవాసం చేస్తారు. 9వరోజున పూజ చేసేటప్పుడు ఏవైనా తప్పులు  జరిగితే క్షమించమని వేడుకోండి. ఈ రోజున కనీసం ఐదుగురు పేదలకు అన్నదానం చేయండి. ఈ వ్రతాన్ని చిన్న పిలల్ల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా చేయవచ్చు. ఖచ్చితంగా 9వారాలు పాటించాలి. ఈ ఉపవాస సమయంలో పండ్లు మాత్రమే తీసుకోండి. సాయంత్రం సాయిబాబా ముందు దీపం వెలిగించి.. ఆయన గుడికి వెళ్లి ఒక్కసారే భోజనం చేయండి. ఉపవాస సమయంలో స్త్రీలకు రుతుక్రమ సమస్యలు ఉన్నట్లయితే మీరు రెండవ గురువారం ఉపవాసం చేయవచ్చు.

Also Read: Jupiter Transit Effect: బృహస్పతి సంచారం... ఏడాదిపాటు ఈ 3 రాశులవారికి డబ్బే డబ్బు..! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News