Vastu Tips for Locker on Thursday: హిందూ మతంలో వారంలోని ప్రతి రోజు ఏదో ఒక దేవతకి అంకితం చేయబడింది. గురువారం శ్రీ హరికి అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీమహావిష్ణువును హిందువులు ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా జాతకంలో బృహస్పతి బలవంతుడని నమ్ముతారు. బృహస్పతి బలపడితే.. సుఖం, ఐశ్వర్యం లభిస్తాయి. అంతేకాదు ఈ రోజున కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల పెళ్లి కాని అమ్మాయిలకు త్వరలో పెళ్లిళ్లు జరుగుతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అవివాహిత స్త్రీలు గురువారం ఉపవాసం ఉంటారు. అదే సమయంలో ఈ రోజున వాస్తుకు సంబంధించిన కొన్ని చర్యలు తీసుకుంటే.. జీవితంలో డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. గురువారం కొన్ని వస్తువులను భద్రంగా ఉంచడం వల్ల వ్యక్తికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గురువారం ఈ వస్తువులను ఖజానా (బీరువా)లో చేర్చితే అద్భుతాలు జరుగుతాయి. ఆ విషయాలు ఏంటో ఇపుడు తెలుసుకుందాం.
గురువారం బీరువాలో ఉంచాల్సిన వస్తువులు:
# గురువారం నాడు శివాలయంకు వెళ్లి శివుడిని పూజించండి. పూజ సమయంలో శివ లింగంపై కొబ్బరికాయను ఉంచండి. ఆరాధన తర్వాత శివుడికి ఆరతి ఇవ్వండి. ఇది మాత్రమే కాదు ఈ రోజున సంపద, ఐశ్వర్యం మరియు కీర్తి కోసం శివుడు మరియు పార్వతి దేవిని ప్రార్థించండి. ఆ తర్వాత కొబ్బరికాయను ఇంటికి తీసుకొచ్చి మీ ఖజానాలో ఉంచండి. ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఖజానా నుంచి కొబ్బరికాయను తీసి పూజించండి.
# జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం నాడు శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మిదేవికి తులసి దళం మరియు పసుపు పుష్పాలను సమర్పించండి. పూజ పూర్తయిన తర్వాత తులసి, పుష్పాలను ఖజానాలో ఉంచాలి. దీంతో అమ్మవారు ఖజానాలో నివాసం ఉంటుంది.
# ఈసారి చైత్ర పూర్ణిమ గురువారం నాడు వస్తోంది. ఈ రోజు సత్యనారాయనను పూజించండి. పూజకు సమర్పించే తమలపాకులను ఖజానాలో ఉంచడం ద్వారా వ్యక్తికి ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. లక్ష్మిదేవి స్వయంగా ఖజానాలో ఉంటుంది.
# శాస్త్రాల ప్రకారం గురువారం పూజలో శ్రీ హరికి తమలపాకులు సమర్పించండి. పూజానంతరం తమలపాకుపై చందనం, తిలకం పూయాలి. ఆ తమలపాకును ఖజానాలో ఉంచండి. ఈ పరిహారం చేస్తే డబ్బు కూడా వస్తుంది.
# వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఖజానాలో ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇందుకోసం గురువారం పూజ సమయంలో కలశం కింద ఎర్రటి రంగు వస్త్రాన్ని పరచి ఉంచాలి. కలశాన్ని సరైన రీతిలో పెట్టి పూజించండి. దీనితో పాటు శ్రీ హరి మరియు లక్ష్మిదేవిని ప్రార్థించండి. పూజ తర్వాత ఖజానాలో ఎర్రటి వస్త్రాన్ని ఉంచండి. ఈ పరిహారం చేస్తే డబ్బు వస్తుంది.
Also Read: Remote Ceiling Fan: సగానికి తగ్గిన రిమోట్ సీలింగ్ ఫ్యాన్స్ ధరలు.. భారీగా విద్యుత్ బిల్లు ఆదా!
Also Read: Tata New Car Launch 2023: మార్కెట్‌లో సంచలనం సృష్టించనున్న టాటా.. త్వరలోనే 4 ఎస్‌యూవీలు రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.