Meaning of 3 colour in National Flag tiranga: ఇవాళ మన దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. దేశంలో ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ప్రతి ఇల్లు మువ్వన్నెల జెండాతో కళకళ్లాడుతోంది. . ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా..‘ హర్ ఘర్ తిరంగా’ (Har Ghar Tiranga) కార్యక్రమం చేపట్టింది భారత ప్రభుత్వం.జాతీయ జెండాకు ఎంత ప్రాధాన్యత ఉందో అందులోని రంగులకు అంతే ఇంపార్టన్స్ ఉంది. ఆస్ట్రాలజీ పరంగా చూస్తే...దేశప్రగతిలో ఈ రంగులు చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి.
కాషాయ రంగు (Saffron Colour): త్రివర్ణ పతాకం యెుక్క కుంకుమ రంగు గురించి చెప్పాలంటే... ఇది గ్రహాల రాజు సూర్యుని రంగు. సూర్యుడు ఆత్మవిశ్వాసం, విజయం, పురోగతి, ప్రకాశానికి కారకుడిగా భావిస్తారు. జ్యోతిష్యం యొక్క దృక్కోణం నుండి చూస్తే.. ఈ రంగు మనల్ని స్వావలంబన దిశగా తీసుకెళ్తుంది. అంతేకాకుండా మనకు శక్తిని కూడా ఇస్తుంది. కాషాయ రంగు ప్రభావం వల్లనే భారత ప్రజాస్వామ్యం బలపడుతోంది. ఈ రంగు త్యాగానికి ప్రతీక. అందుకే భారత ప్రజలు దేశరక్షణ కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడతారు.
తెలుపు రంగు (White Colour): తెలుపు రంగు శాంతికి చిహ్నం. జ్యోతిషశాస్త్రంలో, తెలుపు రంగు చంద్రుడు మరియు శుక్రుడికి సంబంధించినది. చంద్రుడు మనస్సు, సౌమ్యతకు కారకుడైతే.. శుక్రుడు భౌతిక ఆనందం, సంపద, అందం, కళలకు కారకుడు. త్రివర్ణ పతాకంలోని తెలుపు రంగు మనకు శాంతి, సౌభ్రాతృత్వం, కళ, ప్రేమ సందేశాన్ని ఇస్తుంది.
ఆకుపచ్చ రంగు (Green Colour): ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించినది. ఇది మేధస్సు, తర్కం, వ్యాపారం, స్వభావం మరియు పురోగతి యొక్క రంగు. ఆకుపచ్చ రంగు మన దౌత్యాన్ని బలపరుస్తుంది, తెలివితేటలు మరియు నైపుణ్యంతో ప్రపంచాన్ని పరిపాలించే దిశగా తీసుకెళ్తుంది. వ్యాపారాన్ని విస్తరించేలా చేస్తుంది.
నీలం రంగు (Blue Colour): త్రివర్ణ పతాకంలోని అశోక చక్రం కూడా చాలా ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. నీలం రంగు శని దేవుడికి సంబంధించినది. శని న్యాయం మరియు ప్రజలకు దేవుడు. ఈ రంగు దేశంలో న్యాయ ప్రక్రియను బలపరుస్తుంది.
Also Read: Sun Transit 2022: ఆగస్టు 17 నుంచి ఈ 4 రాశుల అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook