Mukkoti ekadashi celebrations: వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదని అనికూడా పిలుస్తారు. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా పిలుస్తారు. మనం ఈసారి జనవరి 10 న శుక్రవారం రోజున వైకుంఠ ఏకాదశిని జరుపుకోబుతున్నాం. ఈరోజుతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమౌతుంది. ఈ రోజున విష్ణు భగవానుడు ముక్కోటి దేవతలతో సహా భూమి మీదకు వస్తారని భక్తులు విశ్వసిస్తుంటారు. అదే విధంగా ఆ శ్రీమన్నారయణుడికి ఉత్తర ద్వారం గుండా వెళ్లి దర్శనం చేసుకుంటే.. జీవితంలోని కష్టాలన్ని పోతాయని.. స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అయితే.. ముక్కోటి ఏకాదశి రోజున చాలా మంది ఉపవాసాలు ఉంటారు.
కేవలం చిన్న పిల్లలు, వయస్సులో పెద్దవాళ్లు, వ్యాధులతో బాధపడే వారు తప్ప.. చాలా మంది ఈరోజున ఉపవాసాలు ఉండేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే.. ఈ ఒక్కరోజున ఉపవాసం చేస్తే.. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులు ఉపవాసం చేసిన పుణ్యం వస్తుందంట. అందుకే ఈరోజు చాలా మంది ఉపవాసం ఉంటారు. అంతే కాకుండా... విష్ణు పురాణం ప్రకారం మరో కథ ప్రాచుర్యంలో ఉంది.. మురాసురుడు అనే అసురుడు ఉండేవాడంట. అతను.. మునుల్ని హింసించే వాడంట. అతను శ్రీమన్నారయణుడు సంహరించేందుకు వచ్చాడని అన్నంలో వెళ్లి దాక్కుంటాడంట. ఆతర్వాత విష్ణువు అతడ్ని సంహారించాడంట. అందుకే ముక్కో ఏకాదశి రోజున మాత్రం అన్నంతినకుండా ఉపవాసం ఉండాలని పండితులు చెబుతుంటారు.
Read more: Snakes in Dream: కలలో పాములు కన్పిస్తున్నాయా..?.. మీకు వంద శాతం జరిగేది ఇదేనంట..!
అయితే.. ఏకాదశి ఒక్కరోజున మురుడు అన్నంలో గుప్తరూపంలో ఉంటాడంట. ఆ రోజున ఎవరైతే అన్నం తింటారో.. వారు అసురుడిలా ఆలోచిస్తారని.. వారు మనస్తత్వం అలా ఉంటుందని కూడా అనాదీగా కథలుగా చెప్పుకుంటు వస్తున్నారు. అందుకే వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున మాత్రం ఉపవాసం ఉండాలని కూడా పండితులు చెబుతుంటారు. ( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది.. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు..)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook