Vastu For Get Huge Money: నిత్యజీవితంలో డబ్బు కీలకపాత్ర పోషిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం కింగ్ లా ఏలుతుంది కేవలం డబ్బు మాత్రమే.. మనం ఏ పని చేయాలన్నా డబ్బు తప్పకుండా కావాల్సిందే గుండు పిన్ను నుంచి పెద్ద పెద్ద భవనాల వరకు ఏది కొనాలన్నా తప్పకుండా డబ్బు కావాల్సిందే. అలాగే డబ్బు ఉంటేనే మనని అందరూ సమాజంలో గొప్పగా గౌరవిస్తారు. డబ్బు చాలామంది లక్షల్లో సంపాదించి అదే లక్షల్లో ఖర్చు కూడా చేస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఎన్ని కోట్లు సంపాదించిన డబ్బు చేతిలో నిలవకుండా ఉంటూ ఉంటుంది. సంపాదించిన కొద్ది సంవత్సరం లోనే ఖాళీ అవుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి సంపాదించిన దానికంటే రెండు రేట్లు ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది. ఎందుకు చాలామందికి డబ్బు నిలవదు.. డబ్బు ఖర్చు కాకుండా ఉండడానికి శాస్త్రంలో ఉన్న రెమెడీలు ఏంటి.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు కాకుండా ఉండడానికి వాస్తు శాస్త్రంలో అనేక రెమిడీలు ఉన్నాయి. ఈ రెమెడీలు వ్యక్తుల జీవితాలనే మార్చేస్తాయి. అంతేకాకుండా ఐశ్వర్యాన్ని కూడా కలిగిస్తాయి. కొంతమంది ఈ రెమెడీలతో ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడ్డారు. అయితే మీరు కూడా ఐశ్వర్యవంతులు కావాలనుకుంటే తప్పకుండా ఈ రెమిడిలను పాటించాల్సి ఉంటుంది. దీనికోసం పెద్దగా ఏం చేయనక్కర్లేదు బీరువాలో మాత్రం కొన్ని వస్తువులను ఉంచితే చాలట. వాస్తు శాస్త్రం ప్రకారం బీరువా సరైన స్థానంలో ఉంచడం చాలా మంచిది. అంతేకాకుండా అందులో కొన్ని వస్తువులను కూడా పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ఈ దిశలో తప్పకుండా బీరువా పెట్టాల్సిందే:
చాలామంది బీరువాను ఏ దిశలో పడితే ఆ దిశలో పెడుతూ ఉంటారు. నిజానికి ఇలా బీరువాను ఎక్కడపడితే అక్కడ పెట్టడం మంచిదేనా? వాస్తు శాస్త్రంలో తెలిపిన వివరాల ప్రకారం బీరువాను కొన్ని దిక్కుల్లో ఉంచడం మంచిదట. అయితే బీరువాను దక్షిణ నైరుతిలో ఉంచడం వల్ల అదృష్టం కలిసి వస్తుందట. అంతేకాదండోయ్ బీరువా తెరవగానే ఉత్తరం దిక్కున కనిపించాల్సి ఉంటుందంట. ఇలా చేస్తే ధనాకర్షణ కలుగుతుందని వాస్తు శాస్త్రంలో ఎంతో క్లుప్తంగా వివరించారు. అంతేకాకుండా బీరువా ఉన్నచోట ఎప్పుడు క్లీన్ గా కూడా ఉండాలని శాస్త్రంలో పేర్కొన్నారు.
ఈ దిక్కున ఎట్టి పరిస్థితుల్లో బీరువాను ఉంచకూడదు:
బీరువాను ఎట్టి పరిస్థితులలో నైరుతి దిశలో గాని ఇతర దిశల్లో పెట్టకపోవడం చాలా మంచిదని వాస్తు శాస్త్రంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో కొన్ని వస్తువులను కూడా పెట్టడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం చాలామంది తెలిసి తెలియక బీరువాల్లో ఎర్రటి వస్తువులను భద్రపరుస్తూ ఉంటారు. మరి కొంతమంది అయితే వస్త్రాలను కూడా పెడుతూ ఉంటారు. నిజానికి బీరువాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎర్రని వస్తువులను దుస్తులను ఉంచడం మంచిది కాదు. వీటికి బదులుగా తెలుపు రంగుతో కూడిన వస్తువులను పెట్టడం చాలా మంచిదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఇది తప్పకుండా ఉంచండి:
హిందూ పురాణాల ప్రకారం చాలామంది వట్టివేరును లక్ష్మీదేవితో పోలుస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ వేరంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ వట్టివేరు నీటితో లక్ష్మీదేవికి అభిషేకం చేయిస్తారు. అదేవిధంగా ఈ వేరుతో పాటు కర్పూర హారతి తో విష్ణుమూర్తికి ప్రత్యేకమైన హారతిని సమర్పిస్తారు. అయితే వట్టివేరు, కర్పూరం రెండింటినీ కలిపి బీరువాలో ఉంచడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయట. ఈ రెండింటినీ బీరువాలో పెట్టడం వల్ల డబ్బుకు కొదవ ఉండదంట. అంతేకాకుండా ఆర్థికంగా వస్తున్న సమస్యలు ఏవైనా సులభంగా తొలగిపోతాయని వాస్తు శాస్త్రంలో క్లుప్తంగా పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి