Vastu Remedies to Attract Money: ఇంటి వాస్తు సరిగ్గా లేకుంటే కుటుంబంలో గానీ, వ్యక్తుల జీవితాల్లో కానీ చాలా రకాల సమస్యలు వస్తాయి. వాస్తు కోపం కారణంగా చాలామందిలో ఆర్థిక సమస్యలతో పాటు మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలామందిలో ఇటీవలే కాలంలో అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వాస్తులో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తులో మార్పులు చేసుకోవడం వల్ల మనిషి జీవితం ప్రకాశవంతంగా తయారవుతుంది. అంతేకాకుండా అదృష్టం కూడా దానంతట అదే వస్తుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఒకటే.. ఇంటి ఉత్తరం దిశలో కొన్ని ప్రత్యేక పనులు చేయాల్సి ఉంటుంది. ఆ పనులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పనికిరాని వస్తువులు ఆ చోట ఉంచరాదు:
వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం దిశను సంపాదన, కుబేరుని దిశగా పరిగణిస్తారు. అయితే ఉత్తరం దిశలో పాడైపోయిన వస్తువులను అస్సలు ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పనికిరాని వస్తువులను ఉంచడం వల్ల వ్యక్తుల జీవితాల్లో చాలా రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరం దిశలో ఎలాంటి వస్తువులను ఉంచరాదు.
ముఖ ద్వారం:
ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉండడం చాలా శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు, సానుకూలత ఉంటుందని వాస్తు శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. ఐశ్వర్యానికి అధిదేవత అయిన కుబేరుని విగ్రహం లేదా ఫోటో ఉత్తరం దిక్కున పెడితే భవిష్యత్తులో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు.
వంటగది:
ఉత్తర దిశలో వంటగది ఉండటం చాలా శుభప్రదం. ఇలా ఉంటే ఇంట్లో డబ్బు, ధాన్యం నిల్వలు ఉంటాయని వాస్తు శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గోడలు పగిలినట్టు కనిపించిన, పగుళ్ళు ఉన్న వాటికి మరమ్మత్తులు చేయాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది.. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Anchor Vishnupriya : బాలయ్య మీద విష్ణు ప్రియ కౌంటర్ వేసిందా?.. దండం పెట్టేసిన యాంకర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook