Vastu Tips: పరిగెట్టే 7 గుర్రాల ఫోటోను ఇంట్లో ఎందుకుంచుతారు, ఏ దిశలో ఉంచితో మీ దశ మారుతుందో తెలుసా

Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. జీవితం ఎలా ఉంటుందనేది జ్యోతిష్య శాస్త్రం వివరిస్తే..ఎలాగుంటే జీవితం బాగుంటుందనేది వాస్తు శాస్త్రం చెబుతుంటుంది. అందుకే ఈ రెండింటికీ అంత ప్రాముఖ్యత. పూర్తి వివరాలు మీ కోసం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2023, 10:49 PM IST
Vastu Tips: పరిగెట్టే 7 గుర్రాల ఫోటోను ఇంట్లో ఎందుకుంచుతారు, ఏ దిశలో ఉంచితో మీ దశ మారుతుందో తెలుసా

Vastu Tips: హిందూ మత విశ్వాసాల ప్రకారం వాస్తు శాస్త్రంలో అంశాలు తప్పకుండా పాటించాలి. జీవితం బాగుండాలి, సరైన దిశలో ఉండాలంటే వాస్తు సూచనలు తప్పకుండా అమలు చేయాలంటారు జ్యోతిష్య పండితులు. వాస్తు దోషాన్ని దూరం చేయాలంటే ఈ సూచనలు పాటించాల్సిందేనంటున్నారు. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంటాయి. 

వాస్తుశాస్త్రం ప్రకారం ఇళ్లు ఏ దిశలో ఉండాలి, ఇంట్లో వస్తువులు ఏవి ఎక్కడ ఎలా ఉంచాలనేది సవివరంగా ఉంటుంది. వాస్తు శాస్త్రంలో చెప్పినవి తూచా తప్పకుండా పాటిస్తే జీవితమే మారిపోతుందంటారు. ఎందుకంటే కొన్ని వస్తువుల్ని సరైన పద్దతిలో ఉంచడం వల్ల జీవితం సవ్యంగా సాగుతుందంటారు. ఎందుకంటే వాటికి ఆ విశిష్టత ఉంటుంది. ఏ వస్తువును ఎక్కడ ఎలా ఉంచాలనేది చాలా ముఖ్యం. వాస్తుశాస్త్రంలో సూచించే చాలా సూచనలు వాస్తు దోషాన్ని దూరం చేయడంలో తోడ్పడతాయి. పలు సమస్యల్నించి బయటపడవచ్చు. అందుకే ఇటీవలి కాలంలో చాలామంది ఇంట్లో వస్తువుల్ని ఉంచే క్రమంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. వాస్తు ప్రకారం ఇళ్లు సర్దుకుంటే నెగెటివిటీ దూరమౌతుందని నమ్మకం. వాస్తు ప్రకారం ఇంట్లో ప్రతి అంగుళం అత్యంత ముఖ్యమైందే. సాధారణంగా ఇంట్లో గోడలపై వివిధ రకాల ఫోటోలు అమర్చుకుంటుంటారు. ఈ ఫోటోల అమరికలో కూడా దిశను పాటించాలంటోంది వాస్తుశాస్త్రం. ప్రత్యేకించి చాలామంది ఇళ్లలో 7 గుర్రాలు పరుగులు తీసే ఫోటోను చూస్తుంటాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ ఫోటోకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఫోటో పెట్టుకుంటే వాస్తుదోషం దూరమౌతుందని విశ్వాసం. దాంతోపాటు మీ జీవితంలో అభివృద్ధి విషయంలో ఎదురయ్యే సవాళ్లు లేదా ఆటంకాలు దూరమౌతాయని నమ్మకం. అయితే ఈ ఫోటోను సరైన దిశలో అమర్చాలంటారు.

మీరు ఒకవేళ ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంటే..ఇంట్లో  పరుగెడుతున్న 7 గుర్రాల ఫోటో పెట్టుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఈ పోటోను అమర్చేటప్పుడు దిశపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. మీ దృష్టి ఎక్కువగా ఎక్కడ పడుతుందో ఆ దిశలో అక్కడ ఈ ఫోటోను అమర్చితే మంచి ఫలితాలుంటాయి. ఇంట్లో ఈ ఫోటో పెట్టడం వల్ల ఆర్ధిక సమస్యలు దూరమై ధనలాభం కలుగుతుందంటారు.

ఇక రెండవది ఇంట్లో నెలకొన్న అశాంతి నుంచి విముక్తి పొందేందుకు 7 తెల్లని గుర్రాల ఫోటో చాలా కీలకపాత్ర పోషిస్తుంది. పరుగెడుతున్న 7 గుర్రాల ఫోటో పెట్టడం వల్ల ఇంట్లో అంశాతి దూరమౌతుంది. అంతా శుభం కలుగుతుంది. ఏ విధమైన ప్రతికూల పరిస్థితి ఎదురుకాదు. 

పెరుగెట్టే 7 తెల్లని గుర్రాల పోటోకు వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే చాలామంది ఇళ్లలో, ఆఫీసుల్లో ఈ ఫోటో పెట్టుకుంటారు. ఈ ఫోటో విజయం, వేగం, సామర్ధ్యానికి ప్రతీక. ఈ ఫోటో అమర్చుకోవడం వల్ల సుఖ శాంతులు, అభివృద్ధి ఉంటాయి.

వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా ఫోటో లేదా వస్తువును అమర్చేందుకు దిశ చాలా ముఖ్యం. అవసరం కూడా. ఎక్కడ పడితే అక్కడ అనాలోచితంగా ఉంచకూడదు. ఈ దిశలో ఉంచే వస్తువు శుభమైన ఫలాల్నిస్తుంది. వాస్తుదోషముంటే దూరం చేస్తుంది. పరుగెడుతున్న 7 తెల్లని గుర్రాల ఫోటో పెట్టేందుకు అత్యంత అనువైన ప్రదేశం ఇంట్లోని లివింగ్ రూమ్. దీనివల్ల ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రసారమౌతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి తూర్పు దిక్కున ఈ ఫోటోను అమర్చుకోవాలి. మీ ఆపీసులో కూడా ఈ ఫోటో పెట్టుకోవచ్చు. దీనివల్ల మీ పనిలో పురోగతి లభిస్తుంది. ఆఫీసులో అయితే దక్షిణ దిశలోని గోడకు అమర్చాల్సి ఉంటుంది.

Also read: Mirror Vastu Tips: ఇంట్లో అద్దం ఏ దిశలో ఎక్కడ ఉండాలి. లేకపోతే ఏం జరుగుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News