Vastu tips for Money: హిందువులు తులసి మెుక్కను పవిత్రమైనదిగా భావిస్తారు. దేవతలతో సమానంగా తులసి మెుక్కను పూజిస్తారు. ఈ మెుక్కలో లక్ష్మీదేవి నివశిస్తూ ఉంటుందని నమ్ముతారు. ఈ చెట్టును పూజించడం వల్ల లక్ష్మీదేవితోపాటు విష్ణువు అనుగ్రహం ఉంటుంది. తులసి చెట్టును (Vastu Tips For Tulsi) రెండు పూటలా పూజించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ అష్టఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయ. జ్యోతిష్యశాస్త్రంలో తులసి మెుక్కకు సంబంధించిన కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి. అయితే ఈ చిన్న పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీరు కోరిన కోరికలన్నీ తీరుస్తుంది.
తులసి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి..
తులసి మెుక్కను పూజించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు. పూజానంతరం 'మహాప్రసాద్ జననీ సర్వ సౌభాగ్యవర్ధిని, ఆది వ్యాది హర నిత్యం తులసీ త్వం నమోస్తుతే' అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. తులసి పూజ సమయంలో ఈ మంత్రాన్ని పఠిస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉండదు. అయితే తులసి మొక్క గురించి ఎల్లప్పుడూ కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. స్నానం చేయకుండా తులసి మొక్కను తాకవద్దు. మురికి చేతులతో తులసి మొక్కను ఎప్పుడూ ముట్టుకోవద్దు. రాత్రిపూట లేదా ఆదివారం తులసి ఆకులను తీయకండి. ఏకాదశి నాడు కూడా తులసి మొక్కకు నీరుపోయవద్దు లేదా ఆకులు తెంచవద్దు.
Also Read: అనంత చతుర్దశి ఎప్పుడు, గణేష్ నిమజ్జన ముహూర్తం, దీని వెనుకున్న కథ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook