Tirgrahi Yog: వృశ్చికరాశిలో త్రిగ్రాహి యోగం .. ఈ 3 రాశులవారి కీర్తి ప్రతిష్టలు పెరగడం ఖాయం..

Tirgrahi Yog:  వైదిక జ్యోతిష్యం ప్రకారం, వృశ్చిక రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం 3 రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 7, 2022, 03:55 PM IST
Tirgrahi Yog: వృశ్చికరాశిలో త్రిగ్రాహి యోగం .. ఈ 3 రాశులవారి  కీర్తి ప్రతిష్టలు పెరగడం ఖాయం..

Tirgrahi Yog In Scorpio: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా రాశిచక్రాన్ని మార్చడం, ఒకదానితో ఒకటి సంయోగం చెందడం జరుగుతుంది.  ఈ కలయిక కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఈనెలలో శుక్రుడు, బుధుడు, సూర్యుడు వృశ్చికరాశిలో ప్రవేశించనున్నారు. ఈ మూడు రాశుల కలయిక వల్ల వృశ్చికరాశిలో త్రిగ్రాహి యోగం (Tirgrahi Yog In Scorpio 2022)ఏర్పడుతుంది. దీని ప్రభావం అన్ని రాశులవారిపై కనిపిస్తుంది. కానీ ఈ యోగం ముఖ్యంగా మూడు రాశులవారికి అపారమైన సంపదను ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

ఈ రాశుల వారికి త్రిగ్రాహి యోగం శుభప్రదం
మకరం (Capricorn): త్రిగ్రాహి యోగం మీకు ప్రయోజనకరంగా ఉంటుందియ ఎందుకంటే మీ రాశి నుండి పదకొండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడబోతోంది. ఆదాయం పెరుగుతుంది. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. 
కుంభం (Aquarius): మీ సంచార జాతకంలో పదవ ఇంట్లో త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. ఇది వ్యాపారం మరియు ఉద్యోగ స్థలంగా భావిస్తారు. కాబట్టి ఈ సమయంలో మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందుతారు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. ఆదాయంలో ఆకస్మిక పెరుగుదల ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. 
మీనం (Pisces): త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల వృత్తి, వ్యాపారాలలో మంచి విజయాన్ని సాధిస్తారు. ఎందుకంటే మీ సంచార జాతకంలో తొమ్మిదవ స్థానంలో ఈ యోగం ఏర్పడబోతోంది. ఇది అదృష్టం మరియు విదేశీ ప్రదేశంగా భావిస్తారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఏదైనా ఇల్లు లేదా మరేదైనా విలాసవంతమైన వస్తువును కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు చేస్తారు. 

Also Read: Rajyog: మీన రాశిలో అరుదైన యోగం.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News