Venus Transit 2024: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..

Venus In Ashlesha Nakshatra: జులై 20వ తేదీన శుక్ర గ్రహం పుష్యమి నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 14, 2024, 10:28 AM IST
Venus Transit 2024: ఆశ్లేష నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..

Venus In Ashlesha Nakshatra: జీవితంలో ఆనందం సంపద కీర్తి ప్రతిష్టలు ఉండాలంటే జాతకంలో తప్పకుండా శుక్రుడు శుభస్థానంలో ఉండాల్సిందే. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహాన్ని ఎంతో ప్రాముఖ్యత కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచార క్రమంలో ఉన్నాడు. ఈ గ్రహం జూలై 31వ తేదీ వరకు సంచార దశలో కర్కాటక రాశిలోనే కొనసాగుతుంది. కీర్తి, ఆనందం, సంపద, సంతోషానికి శుక్ర గ్రహాన్ని కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకుంటారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడంతో మొత్తం అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం ఏర్పడుతుంది. అలాగే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉన్న వ్యక్తులకు జీవితంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చాలా రోజుల తర్వాత ఈ గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. 

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం పుష్యమి నక్షత్రాన్ని విడిచిపెట్టి జూలై 20 తేదీన ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఆశ్లేష నక్షత్రంలోకి ఈ శుక్ర గ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాష్ట్ర వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యుడు చెబుతున్నారు. ముఖ్యంగా శుక్రుడు జాతకంలో శుభ స్థానంలో ఉన్న వ్యక్తులకు విపరీతమైన ధన లాభాలు కలగడమే కాకుండా.. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయని వారంటున్నారు. అలాగే ఈ సంచారంతో కొన్ని రాశుల వారు ఎలాంటి పనులైనా సులభంగా చేయడమే కాకుండా భారీగా ఆర్థిక లాభాలు పొందుతారు. 

శుక్రుడు ఆశ్లేష నక్షత్రం లోకి సంచారం చేయడం కారణంగా లాభపడే రాశులు..
కన్యా రాశి:

శుక్రుడు ఆశ్లేష నక్షత్రం లోకి సంచారం చేయడం కారణంగా కన్యారాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. వీరు ఈ సమయంలో మంచి ఫలితాలు పొందడమే కాకుండా అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. అలాగే జీవితంలో వస్తున్న అన్ని సమస్యల నుంచి విముక్తి పొందుతారు వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. అలాగే పిల్లలనుంచి కూడా ఎప్పుడు వినలేని శుభవార్తలను వింటారు. దీంతోపాటు వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోయి.. భాగస్వాముల మధ్య మధురమైన సమయం ఏర్పడుతుంది. అంతేకాకుండా కుటుంబ బాంధవ్యం కూడా మెరుగుపడుతుంది. వీరు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ధనస్సు రాశి: 
ఆశ్లేష నక్షత్రం లోకి శుక్రుడు ప్రవేశించడం కారణంగా 20వ తేదీ నుంచి ధనస్సు రాశి వారి జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరు ఆర్థికంగా విపరీతంగా ధన లాభాలు పొందుతారు. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా లాభసాటిగా ఉంటుంది. అలాగే వస్తు సౌఖ్యం పెరిగి మంచి లాభాలు పొందుతారు. ముఖ్యంగా పెళ్లి కానీ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అంతే కాకుండా మంచి జీవిత భాగస్వామి లభించే ఛాన్స్ కూడా ఉంది. మతపరమైన పనులపై వీరికి ఆసక్తి పెరిగి దేవుడి అనుగ్రహం కూడా పొందుతారు. సమాజంలో పనులు చేస్తున్న వారికి మంచి గుర్తింపు లభించి పేరు ప్రతిష్టలు పొందుతారు. అలాగే వీరికి కొత్త ఆదాయం లభించి విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. 

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

కుంభరాశి: 
శుక్రుడు సంచారం కుంభ రాశి వారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రేమ జీవితంలో మాధుర్యం పెరిగి భాగస్వామి మీతో ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఖర్చులు పెరిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి కాస్త అదుపులో ఉంటే చాలా మంచిది. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో వారసత్వంగా వస్తున్న ఆస్తులను కూడా పొందుతారు. అంతేకాకుండా సోదరులతో సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కాస్త తగ్గు ముఖం పడతాయి.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News